లాక్ డౌన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ…

లాక్ డౌన్ వల్ల ప్రయోజనం వుండదని ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటించిన మూడు రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.

మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని  క్యాబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పద్థతినే తెలంగాణ అమలుచేస్తున్నది.

ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కొద్ది సేపటి కిందట క్యాబినెట్ సమవేశం జరిగింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు వెసలుబాటు ఉంటుంది. ఉన్నట్లుండి మనసు మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం పట్ల హైకోర్టు కూడా ఆశ్చర్య పోయింది.

‘ఈ రోజు ఉదయం 10 గంటల వరకు మీరు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచనలో లేరు. కానీ సడెన్ గా రేపటి నుండి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైం లో ఎలా వారి ప్రాంతాలకు వెళ్లిపోతారు, అని  హైకోర్టు ఈరోజు ఒక విచారణ ప్రశ్నించింది.

వెసలుబాటు సమయంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు అన్నీ కార్యకలాపాలకు సాగించవచ్చు.  మందు బాబులు నిరాశ చెందకుండా లాక్​డౌన్​ కాలంలో మద్యం దుకాణాలను సూర్యోదయంతో పాటే   ఉదయం 7 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అబ్కారీ శాఖకు ఈ మేరకు  ఉత్తర్వులు వెళ్లాయి. అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  కూడా ఉదయమే మద్యం దుకాణాలను తెరిచిఉంచుతున్నారు.

దేశంలో లాక్ డౌన్ విధించిన రాష్ట్రాలు ఇవే…

  1. ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్ డౌన్ లో  ఉంది. ఇది మే 10 తేదీ దాకా ఉంటుంది. మరొక వారం పొడిగించారు.
  2. బీహార్ : బీహార్ లో కూడా లాక్ డౌన్ విధించారు. ఇక్కడ మే 15 దాకా కొనసాగుతుంది.
  3. ఉత్తర ప్రదేశ్ : యూపి ఈ రోజు దాకా లాక్ డౌన్ కొనసాగింది. మళ్లీ పొడిగించే అవకాశం ఉంది.
  4. ఒదిషా లో నిన్నటి నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ఇది మే `19 దాకా అమలులో ఉంటుంది.
  5. హర్యానాలో ఏడు రోజుల లాక్ డౌన్ కొనసాగుతూ ఉంది. మే 3న ఇది మొదలయింది. అంతకు ముందు 9 జిల్లాలలో వారాంతపు కర్ఫ్యూ అమలులో ఉండింది.
  6. రాజస్థాన్ లో  మే 17 దాకా లాక్ డౌన్ అమలు ఉంది.
  7. చత్తీష్ గడ్ లో మే 15 దాకా లాక్ పొడిగించే అవకాశం ఉంది.
  8. పంజాబ్ వారాంతపు కర్ఫ్యూలు, నైట్ కర్ఫ్యలు కొనసాగుతున్నాయి. మే 15 దాకా ఈ ఆంక్షలుంటాయి.
  9. మధ్య ప్రదేశ్ కరోనా కర్ఫ్యూ  విధించింది. ఇది మే 7 ముగుస్తుంది. దీనిని పొడిగించే అవకాశం ఉంది
  10. గుజరాత్ ప్రభుత్వం 29 నగరాలలోనైట్ కర్ఫ్యూ విధించింది. ఇతర ప్రాంతాలలో ప్రజలు ఏవిధంగా గుమికూడకుండా ఆంక్షలు విధించింది.
  11. మహారాష్ట్రలో ఏప్రిల్ 5 నుంచి లాక్ డౌన్ వంటి ఆంక్షలుకొనసాగుతున్నాయి. ఇపుడ వీటిని మే 15 దాకా పొడిగించారు.
  12. గోవా లో లాక్ డౌన్ ఉండింది.సోమవారంనాడు సడలించారు. అయితే, కోవిడ్ ఆంక్షలు మే10 దాకా కొనసాగుతాయి.
  13. తమిళనాడులో కోవిడ్ ఆంక్షలు మే 20 దాకా కొనసాగుతాయి
  14. పుదుచ్చేరిలో మే 10 దాకా లాక్ డౌప్ ఉంటుంది.
  15. తెలంగాణలో మే 8 దాకా నైట్ కర్ఫ్యూ ఉంటుంది. మే 12 నుంచి లాక్ డౌన్ పది రోజుల పాటు అమలులో ఉంటుంది. ఉదయం  6 నుంచి  10 దాకా వెసలుబాటు ఉంటుంది. ప్రజలు కొనుగోళ్లు ఆ సమయంలో చేసురోవాలి.
  16. ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి పాక్షిక కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు దాకా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఇది రెండువారాలు అమలులో ఉంటుంది. లాక్ డౌన్ అమలులో ఉంది. ఉదయం 6 నుంచి 12 దాకా వెసలుబాటు.
  17. పశ్చిమబెంగాల్ లాక్ డౌన్ లేదు. అయితే, ప్రజలు గుమి కూడడం మీద ఆంక్షలున్నాయి.
  18. అస్సాం సాయంకాలం 6 నుంచి మరుసటి ఉదయం 8గంటలదాకా నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఏప్రిల్ 27 న ఇది మొదలయింది. మే 7 దాకా ఉంటుంది.
  19. నాగాలాండ్ లో రాజధాని ఐజ్వాలో తో పాటు ఇతర జిల్లా కేంద్రాలలో మే 3 నుంచి ఎనిమిది రోజుల లాక్ డౌన్ ప్రకటించారు.
  20. జమ్ముకాశ్మీర్ లో శ్రీనగర్, బారాముల్లా, బుద్దామ, జమ్ము జిల్లలో ఈ రోజు దాకా లాక్ డౌన్ ఉంది. ఇతర మునిసిపల్ ప్రాంతాలలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతూ ఉంది.
  21. ఉత్తరాఖండ్ లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతూ ఉంది.
  22. హిమాచల్ ప్రదేశల్ రేపటినుంచి మే 16 దాకా పదిరోజుల లాక్ డౌన్ విధించారు.
  23. సిక్కింలో కూడా పదిరోజుల లాక్ డౌన్ కొనసాగుతూ ఉంది. ఇది మే 16 దాకా ఉంటుంది. ఇది ఈరోజునేం అమలులోకి వచ్చింది.
  24. కర్నాటకలో   ఏప్రిల్ 27 నుంచి మే 12 దాకా పూర్తి లాక్ డౌన్ విధించారు.  మే 12 నుంచి మరొక రెండు వారాలు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *