తిరుపతి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, CPI నారాయణ గృహ నిర్బంధం

తిరుపతి రుయా ఆసుపత్రిలో అక్సిజన్ అందక నిన్న రాత్రి 11మంది కోవిడ్ రోగులు చనిపోయిన సంఘటన మీద వివరాలు తెలుసుకునేందుకు బయలు దేరిన సిపిఐ జాతీయ నాయకుడు డాక్టర్ నారాయణను పోలీసుల అడ్డుకున్నారు. ఇంటికి తీసుకువచ్చి గృహనిర్బంధంలో ఉంచారు.

తన సొంతవూరు అయణంబాకం. అక్కడి నుండి తిరుపతికి వెళ్ళుతుండగా మార్గమద్యలోనే నగరి  పోలీసులు  చారి నాయకత్వాన ఆపేశారని ఆయన చెప్పారు.  అదేమంటే, ఎవరినీ తిరుపతి అనుమతించకుండా  రాష్ట్రస్తాయి నుండి తమకు ఇలా దేశాలు వచ్చాయని పోలీసు అధికారి చెప్పారు. తిరిగిన తనని తమ గ్రామానినికే  తీసుకువచ్చి గృహనిర్బంధంలో పెట్టారని ఆయన చెప్పారు.  దీనిమీద నారాయణ వివరణ… వీడియోలో…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *