కోవిడ్ సోకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్న ఆంధప్రదేశ్ పేషంట్లను తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేయడం మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంబులెన్స్ లను నిలిపివేసిన సంఘటలన మీద కోర్టు విచారణ చేపట్టింది.
అత్యవసర చికిత్సకోసం వస్తున్న అంబులెన్స్‌లను ఎలా ఆపారు? కరోనా సంక్షోభంలో అంబులెన్స్‌లు నిలిపివేయడం మానవత్వమేనా? అని ప్రశ్నిస్తూ
అంతర్ రాష్ట్ర సరిహద్దులలో అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్న అంబులెన్స్ లను నిలిపి వేసి తెలంగాణ ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19 1(d) ఉల్లంఘించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అసలు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు సరిగ్గా అమలవుతున్నదా? మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించట్లేదు? రంజాన్ మాసం పోయేదాకా కోవిడ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోరా? కోర్టు ఆదేశాలు, సూచనలు తెలంగాణ ప్రభుత్వం ఖాతరుచేయడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.