విశాఖపట్నం సౌత్ జైల్ రోడ్, భీమ్ నగర్ జీవిఎంసి పిహెచ్ సి వద్ద కోవిడ్ వాక్సినేషన్ లేదు అని బోర్డ్ పెట్టారు.
ప్రభుత్వం ప్రజలకు సోమవారం వాక్సిన్ వేస్తామని చెప్పగా ఎంతో మంది ఉదయం 6 గంటల సమయానికి వచ్చి లైన్ లో నిలబడ్డారు. తర్వాత బోర్డు పెట్టారు.
దీనితో ప్రజలంతా నిరాశగా వెళ్లిపోయారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు చాలా ఎదురుచూస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
ఏపీలోని అన్ని జిల్లాల్లో నేడు, రేపు వ్యాక్సినేషన్ నిలిపివేసినట్లు తెలిసింది.
టీకా కేంద్రాల వద్ద రద్దీ, తోపులాటతో వ్యూహం ఈ నిర్ణయం తీసకున్నట్లు సమాచారం. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులు పంపిణీ చేస్తారు.
ఎవరికి ఏ టైమ్ కి వ్యాక్సిన్ వేసే సమాచారంతో స్లిప్పులు ఇళ్లకే పంపిణి చేస్తారని తెలిసింది.అయితే, నిన్ననే ఈవిషయం ప్రకటించిఉంటే,టీకా కేంద్రాలకు ప్రజలు క్యూ కట్టే వారు కాదు.