కుంభమేలా కోవిడ్ నియమాలు పాటించకుండా 45 లక్షల మందిని స్నానాలకు అనుమతించడమే కరోనా సెకండ్ వేవ్ కు కారణమని ప్రపంచమంతా నమ్ముతూ ఉంది. ఇలాగే రాష్ట్రాలలో ప్రధాని మొదలుకుని, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు ప్రచారాలు ర్యాలీలు నిర్వహించడం వల్ల కూడా కోవిడ్ చెలరేగిందని వార్తలొస్తున్నాయి.
మద్రాసు హైకోర్టు ఇంకా చాలా ముందుకు వెళ్లి ఎన్నికల ర్యాలీలలో కోవిడ్ నియమాలను పాటించేలా చేయకపోవడం ఎన్నికల కమిషన్ మీద మర్డర్ కేసు పెట్టాలని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో హరిద్వార్ కుంభమేలా మొదలుకుని ఎన్నికల ర్యాలీల వరకు జరిగిన సంఘటనలో కోవిడ్ నియమాలను గాలికి వదిలేసేందుకు బాధ్యలెవరో తేల్చి చట్టపరంగా శిక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.
సుప్రీంకోర్టు న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇది జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ ల ధర్మాసనం పరిశీలనకు కొద్ది సేపట్లో రానుంది.