నాలుగు రోజులు నిటారుగా పెరిగిన తర్వాత భారతదేశంలో కోవిడ్ కేసులు నాలుగు లక్లల కిందికి దిగాయి. సోమవారం ఉదయం భారత ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటీన్ ప్రకారం, గడచిన 24 గంటలలో దేశంలో366,161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో నమోదయిన కేసుల సంఖ్య 22, 662,57.
గత 24 గంటలలో 3,754 మంది చనిపోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య246,116 కు చేరింది.గత రెండు రోజుల్లో మరణాలు నాలుగువేల పైబడే ఉండేవి. సోమవారం నాటి లెక్కల ప్రకారం మరణాల రేటు 1.08 శాతం.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,589 కేసులు పెరిగి 3, 745, 237 కు చేరింది.
గత 24 గంటల్లో జరిపిన కోవిడ్ పరీక్షలు 1,474, 606. అంతకు ముంద ఇది 1.8 మిలియన్ లు ఉండింది. అంటే కోవిడ్ పరీక్షలు తగ్గిపోతున్నాయని అర్థం.