ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ మొత్తం 60,60,400 డోస్‌లు అందింది. ఇందులో తొలి డోస్ కింద 43,99,802 మందికి, రెండో డోస్ కింద 16,87,315 మంది వ్యాక్సినేషన్ ఇచ్చారు. అంటే ఆ విధంగా మొత్తం 60,87,117 డోస్‌లు ఇచ్చారు.
అదే విధంగా కొవాక్సిన్ మొత్తం 12,89,560 రాగా వాటిలో తొలి డోస్ కింద 9,23,296 వ్యాక్సీన్లు, రెండో డోస్ కింద 2,90,047 వ్యాక్సీన్లు.. మొత్తం 12,13,343 కోవాక్సిన్ డోస్‌లు ఇచ్చారు.
ఆ మేరకు కోవీషీల్డ్, కొవాక్సిన్ రెండూ కలిపి మొత్తం 73,49,960 రాగా, తొలి డోస్ కింద 53,23,098 వ్యాక్సిన్లు, రెండో డోస్ కింద 19,77,362 వ్యాక్సిన్లు.. రెండూ కలిపి ఇప్పటి వరకు మొత్తం 73,00,460 వ్యాక్సీన్లు ఇచ్చారు.
ఇక 45 ఏళ్లకు పైబడిన వారు మొత్తం 1,33,07,889 మంది నమోదు చేసుకోగా వారిలో తొలి డోస్‌ను 41,08,917 మందికి, రెండో డోస్‌ను 13,35,744 మందికి ఇవ్వడం జరిగింది.
ఇంకా ఈ మే నెలలో తొలి 15 రోజులకు సంబంధించి కోవిషీల్డ్, కొవాక్సిన్ రెండూ కలిపి 9,17,850 డోస్‌లు ఇస్తామన్న కేంద్రం, ఇప్పటి వరకు 7,65,360 వాక్సిన్ డోస్‌లు ఇచ్చిందని, ఇంకా 1,52,490 డోస్‌లు రావాల్సి ఉంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కింద కేంద్ర నిర్ణయించిన ప్రకారం 16,85,630 వ్యాక్సీన్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు 4,93,930 మాత్రమే ఇచ్చారని, ఇంకా 11,91,700 వ్యాక్సీన్లు రావాల్సి ఉంది. ఈవిషయాలను కొద్ది సేపటికిందట ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ మీద సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు
వ్యాక్సిన్ సెంటర్ల వద్ద, రద్దీ, తోపులాట పరిస్థితులు కనిపించకూడదు.
వ్యాక్సిన్ ఎవరికి వేస్తారన్నదానిపై ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు స్పష్టంగా చెప్పాలి. దీనివల్ల వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద క్యూలు ఉండే పరిస్థితిని నివారించవచ్చు.
వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కుర్చీలు ఏర్పాటు చేసి, టీకా తీసుకునే వారికి సౌకర్యంగా ఉండేలా చూడాలి. 45 ఏళ్లకు పైబడి మొదటి డోస్ తీసుకుని, రెండో డోస్‌కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్ అందించేలా చూడాలి.
అలా చేయకపోతే (వారికి రెండో డోస్ అందకపోతే) తొలి డోస్ వేసుకున్న ప్రయోజనం ఏమీ ఉండదు.
కాబట్టి, 45 ఏళ్లు పూరైన వారిలో తొలి డోస్ వేసుకున్న వారందరికీ, తప్పనిసరిగా రెండో డోస్ ఇవ్వాలి.
అందువల్ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఇప్పుడు వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.
వారందరికీ వ్యాక్సిన్ పూరై్తన తర్వాత 18 ఏళ్లకు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ డోస్ ఇవ్వాలి.