కార్పోరేట్ శక్తుల గుప్పిట్లోకి మహానగరం!

(టి.లక్ష్మీనారాయణ)

1. గంగవరం పోర్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా 10.39 శాతాన్ని రు.645 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకొంటుందట!

2. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన 1400 ఎకరాల భూమిని గంగవరం పోర్టు నిర్మాణానికి ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10.39% వాటా లభించింది. గంగవరం పోర్టు లాభాల్లో నడుస్తున్నది. ఆ లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా వస్తున్నది. 1400 ఎకరాల భూముల విలువే వేల కోట్లల్లో ఉంటుంది.

3. మన దేశ కార్పోరేట్ దిగ్గజాలలో ఒకటైన ఆదానీ కంపెనీ గంగవరం పోర్టులో 89.61% వాటాలను రెండు ప్రవేటు సంస్థల నుండి కొనేసింది.

4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న 10.39% వాటాను అమ్మేయడాని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొన్నదట. రు.645 కోట్లకు అమ్మబోతున్నట్లు వార్తలొచ్చాయి.

5. కేంద్ర ప్రభుత్వ రంగంలోని విశాఖ పోర్టులో ఇప్పటికే విభాగాల వారిగా ప్రయివేటీకరణ విధానాలు అమలు చేయబడ్డాయి. ఆదానీ కంపెనీ విశాఖ పోర్టులో ఒక బెర్త్ ను లీజుకు తీసుకొని వినియోగించకుండా పేచీ పెట్టుకొని కూర్చొన్నది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా అమ్మకానికి పెట్టవచ్చు.

6. “విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” అంటూ ఉద్యమించి, ప్రాణ త్యాగాలతో సాధించుకొన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం 100కు 100% అమ్మేస్తామని పార్లమెంటు సాక్షిగానే ప్రకటించింది కదా!

7. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తామంటూ లేని వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సృష్టించి, అమరావతి రాజధాని నిర్మాణాన్ని సంక్షోభంలోకి బలవంతంగా నెట్టేశారు.

8. విశాఖ మహానగరాన్ని కార్పోరేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి నెడుతున్నారు.

(టి.లక్ష్మీనారాయణ, సమన్వయకర్త
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *