ఇక నుంచి ఆక్సిజన్ మీద సుప్రీంకోర్టు నిఘా, కేంద్రం ప్రేక్షక పాత్ర

దేశంలోని ఆసుప్రతిలన్నింటిని ఆక్సిజన్ కొరత పీడిస్తూ ఉండటం, ఆక్సిజన్ దొరకక వందలాది పేషంట్లు చనిపోతూండటంతో ఆక్సిజన్ సమస్యను సుప్రీంకోర్టు తన పరిధిలోరి తీసుకుంది.కేంద్రం ప్రభుత్వం నుంచి ఇలా కోర్టు ఆక్సిజన్ వ్యవహారాన్ని తన పరిధిలోకి తీసుకోవడం ప్రజస్వామ్యంలో మంచి సంప్రదాయం కాదు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఓటు అని బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు.

దీనికోసం సుప్రీంకోర్టు 12 మంది తో ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. ఇందులో డాక్టర్లు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు.రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయించేందుకు ఒక న్యాయమయిన శాస్త్రీయమయిన విధానాన్ని ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. ఇపుడు ఆక్సిజన్ సరఫరా గందరగోళంగా ఉంది. కొరత తీవ్రమయి ఆసుపత్రులు ఆక్రందన చేసినపుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, కేంద్రం హుటాహుటిని పంపడం జరుగుతూ ఉంది.దీనితో చాలా మంది రాష్ట్రాలకు, ఆసుపత్రులకు ఆక్సిజన్ అందడంలేదు. కొతర పీడిస్తూ ఉంది. చాలా చోట్ల రోగులకు చికిత్స ప్రారంభిస్తే ఆక్సిజన్ కొరత వస్తుందని ఆసుపత్రులు రోగులునుచేర్చుకోవడం లేదు. కొన్ని చోట్ల రోగులను ఆక్సిజన్ తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఈనేపథ్యంల్ సుప్రీంకోర్టు  జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం పరిశీలించింది. మే 6న  12 సభ్యుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను శనివారం రాత్రి సుప్రీంకోర్టు వైబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు.

ఈ 12 మంది సభ్యుల కమిటీకి క్యాబినెట్ సక్రెటరీ కన్వీనర్ ఉంటారు. ఈకమిటీ రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు అసవరమయిన ఆక్సిజన్ కేటాయించడం, వినియోగాన్ని ఆడిట్ చేయడం కోసం సబ్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తుంది.

ఒక్క మాటలో చెబితే ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం నుంచి సుప్రీంకోర్టు తీసుకుంది. ఇది ప్రభుత్వవానికి వ్యతిరేకంగా ఓటు అని బిజెపి ఎంపి సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్ వ్యాఖ్యానించారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *