ఆంధ్రలో ‘ఆరోగ్య శ్రీ’ పరిధిలోకి కోవిడ్ చికిత్స

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా కాలం నుంచి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను ఆమోదించి కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది.

అనుమతులు పొందిన ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తున్నాయి. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ వెల్లడించారు.

కరోనా వైద్య సేవల కోసం జిల్లా కలెక్టర్ల నుంచి అనుమతులు ప్రైవేటు ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకొస్తున్న‌ట్లు ఆయన తెలిపారు.

ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలు పొందే రోగులకు అన్ని ఆసుపత్రుల్లోనూ అడ్మిషన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలుతీసుకుంటుందని ఆయన చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 637 ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందిస్తున్నారు. . ఆయా ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు 6,870 ఉన్నాయి, వాటిలో 6,323 బెడ్లు రోగులతో నిండాయి, ఇంకా 547 బెడ్లు ఖాళీ గాఉన్నాయి.  వాటిలో కర్నూలులో అత్యధికంగా 281 బెడ్లు ఖాళీ ఉన్నాయి. అనంతరపురం, శ్రీకాకుళం, విశాఖపట్నలో జిల్లాల్లో ఐసీయూ బెడ్లు ఖాళీగా లేవు.  ఆక్సిజన్ బెడ్లు విషయానికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా 23,259 బెడ్లుంటే, వాటిలో 22,265 బెడ్లు నిండాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 15,100 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 3,417 మంది, కర్నూలులో 2,956 మంది  చికిత్స పొందుతున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరాఫరా రోజు రోజుకూ పెంచుతున్నది. 330 టన్నులతో ప్రారంభమైన సరఫరా నేటికి 560 టన్నులు వరకూ పెరిగింది. ఆక్సిజన్ సరఫరా పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వినతిని మన్నిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే కోటాను పెంచింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి 590 టన్నుల ఆక్సిజన్ వచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం 561 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అందజేసింది. శనివారం కన్నా అదివారంనాడు 90 టన్నుల అధికంగా సరఫరా చేశాము. రెమిడెసివిర్ ఇంజక్షన్ల విషయానికొస్తే… గడిచిన 24 గంటల్లో 24,861 ఇంజక్షన్లను ప్రభుత్వాసుపత్రులకు అందజేశాము. 342 ప్రైవేటు ఆసుపత్రులకు 13,461 ఇంజక్షన్లు సరఫరా చేశాము.  వాటిలో ప్రైవేటు ఆసుపత్రులు సొంతగా 7,427 కొనుగోలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 6,034 ఇంక్షన్లు అందజేసింది.

45 ఏళ్ల వారికే వ్యాక్సిన్

రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారికి తొలుత వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించాము.  ఇందుకు అనుమతి కావాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.   రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. వ్యాక్సిన్ కోసం అభివృద్ధి పరిచిన కొవిన్ అప్లికేషన్ ను రెండు రోజుల్లో మార్పు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  సీరమ్ నుంచి మూడున్నర లక్షల కొవిషీల్డ్ డోసులు, భారత్ బయోటెక్ నుంచి 1.42 లక్షల కొవాగ్జిన్ డోసులు వచ్చాయి. రెండ్రోజుల్లో అప్లికేషన్లో మార్పులు చేసిన తరవాత ఈ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *