(సజ్జల రామకృష్ణారెడ్డి)
1. కరోనా వైరస్ కు సంబంధించి ఏమాత్రం అవగాహన లేకుండా, రాజకీయ అంశంకాని సైన్స్ పరమైన అంశాలను కూడా రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు, ప్రజలపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.
గత కొద్దిరోజులుగా కోవిడ్ పై చంద్రబాబు చేస్తున్న విష ప్రచారం, ఇప్పటికే సంక్షోభంలో ఉన్న సమాజంపై తీవ్రం నష్టం జరుగుతుంది. ఢిల్లీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. వివేకవంతులైన ప్రజలు, మేధావులు స్పందిస్తున్న తీరు కూడా ఇందుకు నిదర్శనం. చంద్రబాబు ప్రచారం ఎక్కడకు వెళ్ళిదంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వస్తున్న ప్రయాణికులను 14 రోజులు క్వారంటైన్ లో పెట్టాలని ఆ రాష్ట్రాలు ఆదేశించే పరిస్థితికి వచ్చాయి.
2. చంద్రబాబు మొదలు పెట్టిన ఎన్ 440 కె అనే వైరస్ కర్నూలులో పుట్టిందని, దానివల్ల తక్కువ సమయంలోనే ఆరోగ్యం క్షీణించి, ఆక్సీజన్ అందక తొందరగా చనిపోతున్నారని ప్రచారం చేశాడు. చంద్రబాబు మాట్లాడిన రోజే భయపడ్డాం.. ఇది ఎక్కడకు దారితీస్తుందే అని.
ఊహించినట్టే జరిగింది. చంద్రబాబుకు కనీస జ్ఞానం లేకపోయినా, ఆయన ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయడం, 40 ఏళ్ళ అనుభవం ఉంది, కేంద్రంలో చక్రం తిప్పానని ప్రచారం చేసుకోవడం వల్లే, ఆయన చెప్పింది నిజం అనుకునే పరిస్థితులు కొంతవరకూ ఉండవచ్చు. వాస్తవానికి అది మన సబ్జెక్టు కాదు. అటువంటి అంశాలను సైంటిస్టులు చూస్తున్నారు అని నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా.. అమెరికాలో ఆయనకు తెలిసిన వ్యక్తి ఎవరో చెప్పారని ఇటువంటి తప్పుడు ప్రచారం చేశారు.
చంద్రబాబు సైన్స్ చదవ లేదు. వైరస్ అన్నది రాజకీయ అంశం కాదు. తన పరిధిలో లేని, అవగాహన లేని అంశంమీద దూకుడుగా ముందుకు వెళ్ళి చేస్తున్న విష ప్రచారం ఇది. మన రాష్ట్రం ఖర్మ గాలి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడిగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.
3. కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో కాదు. సెకండ్ వేవ్ అనేది పశ్చిమాది రాష్ట్రాల నుంచి వ్యాప్తి చెందిందని దేశం మొత్తం తెలుసు. అటువైపు నుంచి మనకు రావడం వల్లే ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఘోరమైన పరిస్థితులు చూశాం. దీనిని రాజకీయం చేసి, మాట్లాడుకునే సమయం కాదు గానీ, మనకు తెలియని ఏరియా అయిన సైన్స్ గురించి చంద్రబాబు మేధావిలా మాట్లాడుతున్నాడు. ఏపీలో ఎన్ 440కె స్ట్రెయిన్ ప్రభావం ఉందని ఎటువంటి ఆధారాలు లేవని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా స్పష్టం చేశారు.
ఫిబ్రవరిలో ల్యాబ్ కల్చర్ చేసినప్పుడు అలా వచ్చింది, దానిని సీరియస్ గా తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. వాస్తవానికి ఈ అంశాలు వాటిల్లో తల పండిన వాళ్లు మాట్లాడుకోవాల్సిన, తేల్చాల్సిన విషయాలు, రాష్ట్రానికి ఎంతవరకు కావాలో అంత వరకు తీసుకుని రోగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఫీల్డ్ మనది కాదు. చంద్రబాబు ఖాళీగా కూర్చున్నారు కాబట్టి స్టడీ చేస్తే మంచిదే. ఒక పెద్ద మనిషిలా జాగ్రత్తలు చెబితే మంచిది. ఆఖరికి వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే.. ఆ స్ట్రెయిన్ కు ఏపీ స్ట్రెయిన్ అని పేరు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వైరస్ ను ఫేస్ చేసేందుకు అందరూ పోరాడుతున్న సమయంలో… వివేకవంతులైన వారెవరైనా సంయమనం పాటించాలి. ఎక్కడో చెట్టు కింద కూర్చుని మాట్లాడిన వాళ్ళలా దేశంలో చక్రం తిప్పిన చంద్రబాబు మాట్లాడటం ఏమిటి..? ఈ సంక్షోభ సమయంలో ప్రజలు నిబ్బంరంగా ఉండాలని ఏ సీనియర్ నాయకుడు అయినా మాట్లాడాలి, మాట్లాడతారు, కానీ చంద్రబాబు నాయుడుది మిడి మిడి జ్ఞానం కూడా కాదు, పూర్తి అజ్ఞానం అని అర్థమవుతుంది.
(సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)