తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డిఎంకె నేత ఎంకె స్టాలిన్ పూర్తిపేరు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్. నాటి కమ్యూనిస్టు సోవియట్ యూనియన్ అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్ స్ఫూర్తితో ఆయనకు స్టాలిన్ అని పేరు పెట్టారు. 1953 మార్చి 1న స్టాలిన్ కరుణానిధికి మూడో సంతానంగా పుట్టారు.
అప్పటికి సోవియట్ రష్యా సోషలిస్టు భావాలు చాలా దేశాలను ప్రభావితం చేశాయి. భారతదేశం కూడ సోషలిస్టు పంథాలో నడుస్తూ ఉంది. హిట్లర్ పతనానికి బాట వేసిన వాడిగా స్టాలిన్ ను ఉక్కుమనిషిగా ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. పశ్చిమ దేశాలు స్టాలిన్ ను ఇంకా నియంతగా ప్రచారం చేయడం లేదు. చేస్తున్నా అది ఇంకా వూపందుకోలేదు.
1953 మార్చిన 5 సోవియట్ అధ్యక్షుడు స్టాలిన్ చనిపోయారు.
ఆ రోజు చెన్నై లో ఒక సంతాసభ లో ఎం కరుణానిధి ప్రసంగిస్తున్నారు. హిట్లర్ సోవియట్ యూనియన్లోకి ప్రవేశించకుండా అడ్డుకుని స్టాలిన్ ప్రపంచవ్యాపితంగా హీరో అయ్యారు. ఇలాంటి నేతకు నివాళ్లర్పిస్తూన్న రోజులవి. అందుకే కరుణానిధి కొడుకుకి సోవియట్ హీరో స్టాలిన్ సాహసానికి గుర్తింపుగా స్టాలిన్ అని పేరు పెట్టారు.
నిజానికి కరుణానిధి స్టాలిన్ కు అయ్యాదురై అని పేరు పెట్టాలనుకున్నారు.ఇది రెండు పేర్ల కలయిక. ఆ రోజుల్లో ఇవి రామస్వామి పెరియార్ ని అయ్యా అని పిలిచేవారు. అయ్యా అంటే తెలుగులో పెద్దాయన. అయ్యా కు, డిఎంకె సంస్థాపకుడు సిఎన్ అణ్నాదురై నుంచి ‘దురై’ ని తీసుకుని ‘అయ్యాదురై’అని పేరు పెట్టాలనుకున్నారు.
అయితే, ప్రపంచమంతా స్టాలిన్ ను కీర్తిస్తుండటంతో కరుణానిధి కొడుకు స్టాలిన్ సరైన పేరు అని భావించారు. స్టాలిన్ అనే పేరు పెట్టారు. దానికి తోడు కరుణానిధి నాస్తికుడు. అపుడు సోవియట్ యూనియన్, ఆదేశ పాలసీలు దేశమంతా ఆదర్శవంతమయినవి నమ్మే వారు. సోవియట్ యూనియన్, కమ్యూనిస్టు ప్రిన్సిపుల్స్ నుంచి ద్రవిడ ఉద్యమం కూడా స్ఫూర్తి పొందింది. ఇవన్నీ స్టాలిన్ పేరు వెనక ఉన్నాయి.
అంతేకాదు, దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉండేది.ఫలితంగా సోవియట్ కమ్యూనిస్టు నేతల పేర్లను పిల్లలకి పెట్టే అలవాటుండేది. అందుకే మార్క్స్, లెనిన్, స్టాలిన్ వోల్గా, ప్రావ్దా వంటి పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి.
స్టాలిన్ 1989లో రష్యా వెళ్లినపుడు ఈ పేరు వల్ల సమస్యలొచ్చాయి. విమానాశ్రయంలో దిగగానే అధికారులు పేరేమిటి ప్రశ్నించారు. సాలిన్ అనగానే వారంతా విస్తుపోయారు. ఎందుకంటే, అప్పటికే స్టాలిన్ పేరు దేశంలో బాగా అపఖ్యాతి పాలయింది. ఆయనను ఎగదిగా చూశారు. పాస్ పోర్టను పరిశీలించారు. స్టాలిన్ అని పిలిచేందుకు ఇబ్బంది పడ్దారని ఒక సారి స్టాలిన్ మీడియాకు చెప్పారు.
కమ్యూనిస్టు నియంత పేరు పెట్టుకున్నందున ఆయన చాలా స్కూళ్లో అడ్మిషన్ రాలేదు. చివరకు మద్రాసు క్రిష్టియన్ కాలేజీ స్కూల్ లో అడ్మిషన్ దొరికింది.
స్టాలిన్ గురించి మరిన్ని విశేషాలు:
1975లో ఆయనకు దర్గతో వివాహమయిది. ఆయనకు కుమారుడు (ఉదయనిధి), కూతరు (సెంథామరై) ఉన్నారు. 1967లో 14 వ యేట ఆయన రాజకీయ కార్యక్రమం మొదలయింది . అపుడు ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
1975లో ఎమర్జన్సీ విధించినపుడు మీసా కింద ఆయన అరెస్టయ్యారు. జైలు కెళ్ళారు.
1989లో ఆయన మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అపుడు చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
1996-2002 మధ్య చెన్నై మేయర్ (37వ) మేయర్ గా ఉన్నారు. చెన్నైకి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికయిన మేయరు స్టాలినే..
2009-2011 మధ్య తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రానికి ఆయనే తొలి ఉప ముఖ్యమంత్రి
2013, జనవరి 3 తండ్రి కరుణానిధి స్టాలిన్ తన వారసుడని ప్రకటించారు.