తెలంగాణ NSUI కి చెంది 50 మంది కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి ఈ రోజు మధ్యాహ్నం సూరారం లోని మల్లారెడ్డి హాస్పిటల్ ఎదుట వినూత్న నిరసన తెలిపారు.
బఫర్ జోన్ నియమాలను పాటించకుండా,అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెరువు భూములను కబ్జా చేసి మినిస్టర్ మల్లారెడ్డి హాస్పిటల్ ని నిర్మించారని వెంటనే ఉచిత కరోనా వైద్య హాస్పిటల్ గా మార్చాలని వారు డిమాండ్ చేశారు.
మంత్రిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న మినిస్టర్ మల్లారెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని కూడా వాళ్లు డిమాండ్ చేశారుు.
నిరసన తెలిపే క్రమంలో ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ మల్లారెడ్డి హాస్పిటల్ బోర్డు కు నల్ల రంగు వేసేందుకు ప్రయత్నించడంతో మల్లారెడ్డి హాస్పిటల్ భద్రతా సిబ్బంది, మినిస్టర్ మల్లారెడ్డి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆపే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
దీనితో NSUI నాయకులకు సిబ్బందికి తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకొని నిరసన తెలుపుతున్న NSUI నాయకులను అదుపులోకి తీసుకొని దుండిగల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ బఫర్ జోన్ నియమాలను పాటించకుండా,అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెరువు భూములను కబ్జా చేసి మినిస్టర్ మల్లారెడ్డి హాస్పిటల్ ని నిర్మించారని కాబట్టి వెంటనే ఉచిత కరోనా వైద్య హాస్పిటల్ గా మార్చాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని, అక్రమాలకు పాల్పడుతున్న మినిస్టర్ మల్లారెడ్డి నీ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని కోరారు.
కరోనా బారిన పడి తెలంగాణ ప్రజలు ప్రాణాలను కోల్పోతుంటే రాష్ట్రంలో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని సీఎస్ సోమేష్ కుమార్ మీడియా ముఖంగా పేర్కొనడం సిగ్గు చేటని, తమ నిరసన వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తామందరం పీపీఈ కిట్లు ధరించడం జరిగింది తెలిపారు.