గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,14,188 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,915 మంది మృతి. చాలా మంది నిపుణులు చెబుతున్నట్లు దేశం మే నెలాఖరుకల్లా నాలుగు నుంచి అయిదు వేల మృతులసంఖ్యను చేరుకునేలా కనబడుతూ ఉంది. ఇంతవరకు మహారాష్ట్ర నుంచి భారీగా కేసలువచ్చేవి. ఇపుడు కర్నాటక, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లనుంచి పెద్ద ఎత్తున కొత్త కేసులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా లో కూడా పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నాయి. ఇపుడు అమలులో ఉన్న కర్ఫ్యూ వల్ల ప్రయోజనం లేకపోతే, టాప్ 5 రాష్ట్రాల పక్కనే ఆంధ్ర ప్రదశ్ కూడా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Worldometers డేటా ప్రకారం వరుసగా రెండురోజుల పాటు నాలుగు లక్షల పైబడిన కేసులు నమోదయిన దేశం ప్రపంచంలో భారత్ యే. గురువారం నాటికి మొత్తం కరోనా కేసులు 21 మిలియన్లు చేరకున్నాయి.
దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,14,91,598 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం దేశంలో 36,45,164 యాక్టివ్ కేసులున్నాయి. ఇది మొత్తం కరోనా సోకిన వారిలో 16.96 శాతం.
కరోన నుండి ఇప్పటి వరకు 1,76,12,351 మంది బాధితులు కోలుకున్నారు.కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 2,34,083 మంది మృతిచెందారు.
ఇండియాలో కోవిడ్ ఇలా పెరిగి పెరిగి…
గత ఏడాది ఆగస్టు 7న ఇండియాలో కోవిడ్ కేసులు 20 లక్షలు దాటాయి. ఆగస్టు 23న 30 లక్షలు దాటాయి. సెప్టెంబర్ 5న 40లక్షలు, సెప్టెంబర్ 16 న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80లక్షలు , నవంబర్ 209న 90 లక్షలు, డిసెంబర్ 19 నాటికి ఒక కోటి దాటాయి. 2021 మే నాలుగో తేదీనాటికి రెండుకోట్లు దాటాయి.