ఎపిలో చద్ది వార్త గొడవ: చంద్రబాబు మీద ‘కరోనా కేసు’

తెలుగుదేశం పార్టీ, వైసిపిల మధ్య నడుస్తున్న కోవిడ్ వార్ కొత్త మలుపు తిరిగింది. టిడిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను తప్పుదారిపట్టించి భయాందోళనలకు గురిచేస్తున్నారని ఈ రోజు ఆయన మీద కర్నూలులో కేసు నమోదయింది.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజుకున్న కరోనా వైరస్ గొడవంతా చద్ది వార్త. ఎపుడో గత ఏడాది కరోనా మొదటి వేవ్ నాటి వార్త  చుట్టూ ఈ గొడవ తిరుగుతూ ఉందని  సెంటర్ ఫర్ సెల్యులార్ మోలెక్యులారా బయాలజీ (CCMB)శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొంది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర కరోనా వైరస్  వేరియాంట్ N440k మీద పెద్ద క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఈ వైరస్ రకం అత్యంత ప్రమాదకరమయిందని, ఇది మొదట కర్నూలులో కనిపించిందని,  ఇది మిగతా వేరియాంట్స్ కంటే చాలా ప్రమాదకరయిందని ఆయన పార్టీనేతలకు చెబుతున్నారు.ట్వీట్ చేస్తున్నారు. ఈ వైరస్ రాష్ట్రంలో బాగా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉందని, దీనిని ఆరికట్టేందుకు లాక్ డౌన్ విధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఈ  ప్రచారాన్ని రూలింగ్ వైసిసి ఖండిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడని, దీని వల్ల కోవిడ్ కంటే, చంద్రబాబా ప్రమాదకారని అని వైసిసి నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం  నాడు కర్నూలుకు చెందిన న్యాయవాది సుబ్బయ్య  ఇచ్చిన ఫిర్యాదుపై చంద్రబాబు నాయుడి మీద  పోలీసులు కేసు నమోదు చేశారు.

కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని పిర్యాదులో పేర్కొన్నారు.

ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.  ఇదే విధంగా చంద్రబాబుపై 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద  ప్రకృతి వైఫరిత్యాల చట్టం కింద నాన్‌బెయిల్‌ సెక్షన్లు నమోదు చేసి ఫ్‌ఐఆర్‌ రిజిస్ట్రర్‌ చేశారు.

N440k కరోనావైరస్ వేరియాంట్ గత ఏడాది కర్నూలులో కనిపించిందని  హైదరాాబాద్ కు చెందిన సిసిఎంబి  గుర్తించింది. ఈ లోపు ఇది చాల ప్రమాదకరమదయిందని, ఇతర కరోనా వేరియాంట్స్ కంటే 10  రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి.   ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్నాటక లలో బాగా వ్యాప్తి చెందిందని చెబుతున్నారు. ఈ లోపు  ఒదిశాలోకి ఈ వైరస్ ప్రవేశించిందని ఆ రాష్ట్రం  ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులను మూసేసింది.

ఢిల్లీలోకి  ఈ రెండు రాష్ట్రాల ప్రజల రావడం ఆంక్షలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం మూలంగానే ఢిల్లీ, ఒదిషాలలో తెలుగు వాళ్ల మీద వివక్ష మొదలయిందని వైసిపి నేతలు టిడిపి మీద ఎదరుదాడి మొదలుపెట్టారు.

N440k ప్రమాదకరం కాదు:CCMB

ఈ లోపు శాస్త్రవేత్తల నుంచి  ఆసక్తికరమయిన సమాచారం బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పంపిన శాంపిల్స్ ను పరిశీలించిన సిసిఎం N440k ప్రమాదకరమయిందనే విషయం నిర్ధారణ కాలేదని పేర్కొంది.

కొద్ది రోజుల కిందట దక్షిణ భారత దేశంలో ఎక్కువగా కనిపించిన N440k  వేరియాంట్ మెల్లిగా కనుమరుగై పోతున్నదని, దీని స్థానంలోకి యుకె వేరియాంట్ వచ్చి చేరుతున్నదని సిసిఎంబి శాస్త్రవేత్త డా. రాకేశ్ మిశ్రా ఇండియా టుడే కి తెలిపారు. తాను ఇపుడు ఎక్కువ ఆందోళన చెందుతున్నది యుకె వేరియాంట్ వైరస్ గురించేనని ఆయన చెప్పారు.  N440kని  స్థానాన్ని యుకె వైరస్ ఆక్రమిస్తూ ఉందని ఆయన వెల్లడించారు.

మొదటి వేవ్ కరోనా కాలంలో N440k ఆందోళన (Variant of Concern) కలిగించింది. అయితే, ఇపుడు సెకండ్ వేవ్ సమయంలో దాని స్థానంలోకి యుకె వేరియాంట్ వచ్చి చేరుతూ ఉందని, అది చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *