ఆంధ్రప్రదేశ్ లో పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రావడంతో తెలంగాణ ఆర్టీసి బస్ సర్వీసులను నిలిపి వేసింది. ఈ విషయాన్ని ఎండి సునీల్ శర్మ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి ఉదయం ఆరుగంటల దాకా కర్ప్యూ అమలు లో ఉంటున్నది. ఈ కాలంలో ఆంధ్ర అధికారులు బార్డర్లు మూసేస్తున్నారు. అత్యవసర సర్వీసులను తప్ప మిగతా వాహానాలను అనుమతించడం లేదు. కేవలం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ప్రజల వాహనాలను అనుమతిస్తున్నారు.
అందువల్ల ఉదయం 6 గంటలకు తెలంగాణ నుంచి వెళ్లి, మధ్యాహ్నం 12 గంటల లోపు తిరిగి వచ్చే అవకాశం లేకపోవడంతో బస్ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ,ఏపీ మధ్య మెడికల్ ఏమర్జెన్సీ వాహనాలను, ఇతర సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్నారు.
తెలంగాణ నుండి ఆంధ్ర మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలను కూడా ఆంధ్ర సరిహద్దు దగ్గిర నిలిపివేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ నియమాలను సడిలించే వరకు బస్సులు తిరగవని ఆయన తెలిపారు.