కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం సంపూర్ణంగా లాక్ డౌన్ ప్రకటించింది. మే 8వ తేదీ నుంచి 16వ తేదీ దాకా ఇది అమలులో ఉంటుంది. గడచిన 24 గంటలలో 41,953 కొత్త కేసులు కనిపించడంతో కేరళ ప్రభుత్వం లాక్ విధించాలని నిర్ణయించింది. కేరళ పాజిటివిటి రేటు 25.69 శాతం. గత 24 గంటలలో 54 మంది చనిపోయారు.
మంగళవారం నాడు రాష్ట్రంలో విధించిని మినిలాక్ డౌన్ పనిచేయకపోవడంతో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. వరుసగా రెండు వారాల పాటు కరోనా కొత్త కేసులు భారీగా కనిపించిన 30 జిల్లాలో కేరళ జిల్లాలు 10 ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గురించి ఆందోళన మొదలయింది. ఇందులో ఆంధ్రా జిల్లాలు ఏడు, కర్నాటక జిల్లాలు 3, తమిళనాడు నుంచి ఒక జిల్లా ఉన్నాయి.
లాక్ డౌన్ పూర్తివివరాలు అందాల్సి వుంది.