దేశంలో కరోనా వైరస్ ఇంకా రూపాంతరం చెంది, మన ఇమ్యూనిటీని దాటుకునే శక్తి సంతరించుకుంటే కోవిడ్ మూడో ఉప్పెన ను తొందరల్లో చూడక తప్పదని ఢిల్లీ లోని ఆఖల భారత వైద్యశాస్త్రాల సంస్థ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా హెచ్చరించారు.
అందువల్ల కఠిన చర్యలు అవసరమని చెబుతూ కొంతకాలం లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
కొన్ని రాష్ట్రాలలో ఇపుడు విధిస్తున్న నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు.
ఇపుడు ఢిల్లీ, తెలంగాణ, కర్నాటకలతో సహా అనేక రాష్ట్రాలలో పాక్షిక లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి కరోనా వ్యాప్తి నియంత్రణ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో కూడా పాక్షిక కర్ఫ్యూ మధ్యానం 12 నుంచి సాయంకాలం ఆరు దాకా విధిస్తున్నారు. ఇలాంటి చర్యలు పెద్ద ఫలితాలీయవని ఆయన చెబుతున్నారు.
ఈనేపథ్యంలో డాక్టర్ గులేరియా చేసిన వ్యాఖ్యలకు చాలా ప్రాముఖ్యం ఉంది.
ఇపుడు దేశంలో కోవిడ్ ఎమర్జన్సీ పరిస్థితి ఏర్పడింది. ఎటూచూసిన కరోనా కసులు వస్తున్నాయి. ఆసుపత్రులలో పడకలు చాలడం లేదు. ఆక్సిజన్ కొరత పీడిస్తూ వందలాది మంది మరణాలకు కారణమవుతూ ఉంది. మరొక వైపు మందులు బ్లాక్ మార్కెట్ అవుతున్నాయి. నేపథ్యం గురించి ప్రస్తావించినపుడు వైరస్ వ్యాప్తినివారించేందుకు కొంతకాలం లాక్ డౌన్ విధించాలని (lockdown for a sufficient duration is needed to cut virus transmission) డాక్టర్ గులేరియా ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
“మూడు విషయాలను మనం గుర్తుంచుకోవాలి. మొదటిది: ఆసుపత్రి వసతులను మెరుగుపర్చాలి. రెండు: ఉధృతంగా కరోనా కేసులను తగ్గించేందుకుచర్యలు తీసుకోవాలి. మూడు: వ్యాక్సినేషన్. వైరస్ వ్యాప్తి చైన్ ను తెంచేయాలి. మనుషుల మధ్య భౌతికదూరం తగ్గిపోతే,కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది,’ అని ఆయన అన్నారు.
వారాంతపులాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యలూ వల్ల ఫలితం ఉండదు. లాక్ డౌన్ చాలా కఠినంగా కొంతకాలం ఉండాల్సిందేనని ఆయన చెప్పారు.
“There is no point in weekend lockdowns and night curfews. The lockdown has to be aggressive for a sufficient period of time,” అని ఆయన చెప్పారు.
కరోనా మూడో ఉప్పెన ఎందుకొస్తుంది?
కరోనావైరస్ పరిణామం చెందితే కోవిడ్ మూడో దాడి ఎదురవుతుంది. దీనికి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎంత తొందరగా మనం ప్రజల్లో ఇమ్యూనిటీ పెరిగేందుకు వ్యాక్సిన్ ఎక్కిస్తాం? వైరస్ ఎలా పరిణామం చెందుతుంది? ఒకవేళ వైరస్ పరిణామం చెంది, ఇమ్యూనిటీని కూడా తప్పించుకునే స్థాయికి వస్తే, అపుడు మనుషుల్లో వచ్చిన ఇమ్యూనిటీ వైరస్ మీద పనిచేయదు. పర్యవసానాంగా మీకు మరొక సారి వైరస్ సోకుతుంది. అదే ధర్డ్ వేవ్, మూడో ఉప్పెన, మూడోదాది.
“One has to understand few things. How quickly can we vaccinate individuals to give them immunity? And second is how does the virus change? If the virus evolves further and it develops an immune escape mechanism, i.e., the immunity that people have developed becomes less effective and you can get the infection again, then there is a chance that we may see a third wave of the pandemic.”