రేపు మోదీ క్యాబినెట్ భేటీ, లాక్ డౌన్ మీద నిర్ణయం ఉంటుందా?

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రా స్ట్రెయిన్ వంటి కొత్త కరోనా వేరియాంట్స్  గురించి ఆందోళన కరమయిన వార్తలు వెలువడుతున్నాయి.

నైట్ కర్ఫ్యూ,  వారాంతపు లాక్ డౌన్ ల వల్ల ప్రయోజనం లేదు, మొత్తం లాక్ డౌన్ కొంతకాలం బిగించాల్సిందే నని AIIMS డైరెక్టర్ డాక్టర్ గులేరియా వంటి నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. వైరస్ కొరత పీడిస్తూఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బిజెపి వోడిపోయింది.

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎండల్లో ఎంత చెమటోడ్చినా పరాజయ పరాభవం తీవ్రంగా ఎదురయింది.   కేంద్రం కరోనా వ్యాక్సిన్  ధరల విషయంలో  తీసుకున్న నిర్ణయం సరయిందికాదని కోర్టులు చివాట్లు పెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో రేపు కేంద్ర ప్రధాని మోదీ అధ్యక్షతనకేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతంది.

ఉదయం గం. 11.00కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరగుతుంది. ఆ తర్వాత 11.05కు భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతుంది.

లాక్ డౌన్ విషయంలో తనే మీ చేయలేనని, నిర్ణయం తీసుకోవలసిందే రాష్ట్రాలేనని కేంద్రం వాదిస్తూ వస్తున్నది. దీనిని సుప్రీంకోర్టు అంగీకరించడం లేదు.  లాక్ డౌన్ విధించే విషయం పరిశీలించాలని కోర్టు కోరింది.

మొత్తానికి  చుట్టూర కోవిడ్ సంక్షోభం మూడు రాష్ట్రాల్లో ఓడిపోయిన రాజకీయ సంక్షోభం మధ్య మోదీ క్యాబినెట్ సమావేశమవుతూ ఉంది. ఏదైనా కీలక నిర్ణయం ఉంటుందా?

రేపు లాక్ డౌన్ గురించి ఎదైనా స్పష్టమయిన నిర్ణయం తీసుకుంటుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *