భారతదేశంలో అనేక చోట్ల కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్ కారణంగా షోరూమ్ లు మూతపడటంతో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఉత్పత్తిని సగానికి తగ్గించాలనుకుంటున్నది. సేల్స్ సైడ్ ప్రాబ్లమ్ వచ్చింది. చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్, కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధించారు. దీనితో మారుతి కార్ల డీలర్లు దుకాణాలు కట్టేయాల్సి వస్తున్నది. ఇప్పటికయితే సగం షోరూమ్ లు మూతపడ్డాయని మారుతి చెయిర్మన్ ఆర్ సి భార్గవ చెప్పారు. ఇపుడు 50 నుంచి 60 శాతం కెపాసిటీతోనే ప్లాంట్లు పనిచేస్తున్నాయని ఆయన బ్లూమ్ బర్గ్ టెలివిజన్ కు చెప్పారు.
హిందూజా గ్రూప్ కు చెందిన అశోక్ లేల్యాండ్ కూడా ప్రొడక్షన్ తగ్గిస్తూన్నట్లు నిన్ననే ప్రకటించింది. కోవిడ్ రెండో వేవ్ వల్ల వాహనాల డిమాండ్ పడిపోవడంతోదేశంలోని అన్ని యూనిట్లలో ప్రొడక్షన్ ను నిలివివేస్తున్నట్లు సోమవారం నాడు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.