తెలుగు రాష్ట్రాల్లో చెలరేగుతున్నది ‘కర్నూల్ కరోనావైరస్’ N440k

ఆంధప్రదేశ్ లో  బీభత్సం సృష్టికోవిడ్ స్ట్రెయిన్ ఏది?  చర్చ మొదలయింది.  రాష్ట్రంలో విపరీతంగా వ్యాపిస్తూ, పాజిటివ్ కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యనుపెంచుతున్న కరోనా వైరస్ స్ట్రయిన్ పేరు N440k. దీని వల్లే కేసులు పెరిగిపోయి, చివరకు ఆసుపత్రులలో పడకలు దొరకని పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.  ఇది అత్యంత ప్రమాదకరమయిన స్ట్రెయిన్ అని  తెలుగుదేశం అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ వైరస్  వ్యాప్తి నివారించాలంటే లాక్ డౌన్ పెట్టాలని ఆయన కోరుతున్నారు. ఎందుకంటే ఈ స్ట్రెయిన్ మిగతా వేరియాంట్స్ కంటే పది రెట్లు వేగంగా వ్యాప్తిస్తుందని ఆయన చెప్పారు.

N440K కరోనా వైరస్ స్ట్రెయిన్ హైదరాబాద్, ఘాజియాబాద్ లలో కనిపించింది. ఇది ఇతర కరోనావైరస్ ల కంటే,  పది నుంచి 100 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని వార్తలు వస్తున్నాయి.ఇది మొదట కర్నూలులో కనిపించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తికి ఇదే కారణ మంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో సహా అనేక ప్రాంతాలో ‘కర్నూల్ వైరస్’ కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో మూడింట ఒక వంతు కేసులకు  ఇదే కారణమని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

ఈ రకం కరోనా వైరస్ మీద హైదరాబాద్ లో  సిసిఎంబితోపాటుఘాజియాబాద్ లోని అకాడెమీ ఫర్ సైంటిఫిక్  అండ్ ఇన్నొవేటివ్ రీసెర్చ్ (AcSIR)  పరిశోధన జరుపుతున్నాయి. గత రెండు నెలల్లో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీష్ గడ్ లలోని పాజిటివ్ కేసులలో 50 శాతం ఈ రకం వల్లే నని తెలిసింది.

ఇది ఇలా ఉంటే గత రెండు రోజులుగా కేసులు ఎక్కువగా పెరిగాయి, బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రంలో కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో రాష్ట్రంలో 71 మంది కోవిడ్ జబ్బుతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 8,207కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,15,275 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,51,852 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న పాజిటివ్ కేసులకు   N.440 k వైరస్ వైరియాంట్ కారణమన్నవాదనను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది.  ఈ రకాన్ని   సి.సి.ఎం.బి శాస్త్ర వేత్తలు  2020జులై లోనే గుర్తించారని, ఇది కొత్తది కాదని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ పేర్కొన్నారు., ఈ స్ట్రెయిన్ వల్ల కొత్త కేసులు వస్తున్నాయి అనడం సరికాదు అని ఆయన చెప్పారు.

కర్ఫ్యూ నియమాలు రేపు విడుదల

పాక్షికంగా కర్ఫ్యూ కు సంబంధించిన నియమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు సాయంకాలం లోగా విడుదల చేయనుంది. ఉదయం 06 నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు ఎలాంటి నిబంధనలు ఉండవు. కాకపోతే, సెక్షన్ 144 అమలులో ఉంటుంది. 5 గురు మించి గుంపుగా ఉండకూడదు. మధ్యాహ్నం 12 గంటలు నుంచి మరుసటి ఉదయం 6 గంటలు వరకు ఒక నిబంధనలు పెట్టె యోచనలో ప్రభుత్వం ఉంది.

కర్ఫ్యూ సమయంలో  ప్రజలకు ఏవిధంగా ఇబ్బంది లేకుండా చూస్తామని, రోజురోజుకు పెరుగుతూ వస్తున్న కేసులు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన కొద్ది సేపటి కిందట విలేకరులకు చెప్పారు.

వాక్సిన్ మొదట పెద్దవాళ్లకే..

మే నెలలో 13 లక్షల డోసులు రాష్ట్రాలనికి అందుబాటులోకి వస్తున్నాయని సింఘల్ చెప్పారు.

మొదటి దశలో 45 ఏళ్ళు పైబడిన వాళ్లకు పూర్తి చేసిన తర్వాతనే  18-45 ఏళ్ల వయసు వాళ్లకు వ్యాక్సిన్ వేస్తామని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి మిగిలిన వ్యాక్సిన్ కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *