కోవిడ్ సోకడంతో ఆసుపత్రిలో చేరిన మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత సబ్బంహరి మరణించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి నిన్నటి నుంచి విషమించింది. దీనితో ఆయన ఆయన కొద్ది సేపటి కిందట మృతిచెందారు.
కరోనా సోకడంతో కొద్ది రోజుల కిందట ఆయన విశాఖలోని అపోలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా మారటంతో వెంటిలేటర్ అమర్చి చికిత్స చేస్తున్నారు.
ప్రస్తుతం ఆరోగ్యం మరింత క్షీణించిందని డాక్టర్లు చెప్పినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు.
గతంలో ఆయన విశాఖ మేయర్ గా ఎన్నుకోబడ్డారు. తర్వాత ఆయన 2009లొ 15వ లోక్ సభ కు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.