ఏ వైపు నుంచి కూడా తప్పించుకునేందుకు వీలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం మాజీ మంత్రి ఈటలర రాజేందర్ చుట్టూ కేసులు ఉచ్చు పన్నుతూఉంది.
మే 2 వ తేదీన రెండు తెలుగు దిన పత్రికల్లో ఈటల భూకబ్జా మీద వచ్చిన రిపోర్టు ల మీద విచారణ జరిపేందుకు నలుగరు ఐఎఎస్ అధికారులతో ఒక ఒక టీం ఏర్పాటు చేసింది.
పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు టీమ్ లీడర్ గా వ్యవహరిస్తారు. ఈ టీమ్ లో నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోలికేరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి లు సభ్యులు గా వుంటారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్ పేట మండలం లోని దేవరయంజాల్ గ్రామపరిధిలో గల, శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి చెందిన 1521 ఎకరాల 13 గుంటల భూములను మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు మరికొందరు కబ్జాచేశారు. వీటి విలువ వేల కోట్లు చేస్తుందని ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన జివొలో పేర్కొంది.
చట్ట విరుద్దంగా వ్యవహరిస్తూ తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారనీ, అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఆలయ భూములను ఆక్రమించుకోవడంతో భక్తుల మనోభావాలను దెబ్బతిన్నాయని ప్రభుత్వం భావించింది. ఈ భూ ఆక్రమణ గురించి మీడియాలో వార్తలు వచ్చాయని వాటి ఆరోపణల మీద సమగ్ర దర్యాప్తు కోసం ఈ టీమ్ అని జివొ లో పేర్కొన్నారు.
ఈ కమిటీ ఏంచేస్తుందంటే..
ఆక్రమణలకు గురయిందనే భూమి వివరాలను సేకరించడం.ఆక్రమణకు ఎట్లా గురయింది ? ఆ భూమిని దేనికి వినియోగిస్తున్నారు? ఆక్రమణ దారుల దగ్గర వున్న డాక్యుమెంట్లు ఏమిటి ? దీనికి సంబంధించి ప్రభుత్వ సంస్థ అనుమతులు ఇచ్చిందా అనే విషయాలను సేకరించడం, ప్రస్థుతం అమలులోవున్న ప్రభుత్వ నిబంధనలను ఆక్రమణ దారులు ఎట్లా ఉల్లంఘించారు అనే వివరాలను సేకరించడం, ఖాలీ భూములు ఎంత విస్తీర్ణంలో వున్నాయి. ఆక్రమణల వెనకున్న బినామీలు ఇతర పెద్దమనుషులు ఎవరు ? తద్వారా దేవాలయానికి ఎంతమేరకు ఆదాయం నష్టం జరుగుతున్నది ? దర్యాప్తు అనంతరం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? సత్వరమే ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సిందిగా జివొ లోపేర్కొన్నారు. జివొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంతకంతో విడుదల చేశారు.
ఇంకా ఎన్నికుంభకోణాలను ప్రభుత్వం వెలికితీస్తుందో చూడాలి. పత్రికల్లో వచ్చిన ఆరోపణలన్నింటి మీద ఇలా దర్యాప్తు చేస్తారేమో చూడాలి.