ఆంధ్రాలో రెండు వారాల పాక్షిక కర్ఫ్యూ

రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ లో పాక్షికంగా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు.

ఈ రోజు కోవిడ్‌ పరిస్థితులపై జరిగిన  సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ ఈ నిర్ణయం ప్రకటించారు.

ఈ పాక్షిక కర్ఫ్యూ బుధవారం  నుంచి అమలులోకి వస్తుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్కెట్లు పని చేస్తాయి. మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుంది..మధ్యాహ్నం వరకు అన్ని షాపులు తెరిచిన సమయంలో 144 సెక్షన్‌ అమలు చేస్తారు. 5గురికి మించి ఒకే చోట చేరకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.  కర్ఫ్యూ 2 వారాల పాటు అమలులో ఉంటుంది.

ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని ఆసుపత్రులలో పడకల కొతర, ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *