కరోనా వైరస్ రెండో దశ విజృంభిస్తున్నందున రేపటి నుంచి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను బంద్ చేస్తున్నారు. మే 16 వ తేదీ దాకా ఇక్కడ వ్యాపారా కార్యకలాపాలు బంద్ అవుతున్నాయి. మళ్లీ 17వ తేదీ సోమవారం నుంచి వ్యవసాయ మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని అధికారులు ప్రకటించారు.
వ్యవసాయ మార్కెట్ పలువురు ఉద్యోగులకు , వ్యాపారులకు కోవిడ్ వ్యాధి రావడంతో అందరితో సంప్రదించి మార్కెట్ ను మూసేయాలని నిర్ణయించినట్లు అధికాులు చెప్పారు.