తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉందని ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. జిల్లాల వైద్య కేంద్రాలు ఎక్కువ కరోనా పరీక్షలు చేయడం నిషేధం విధించినా పెరుగుదల ఆగినట్లు ఇంకా కనిపించలేదు. వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోటా విధించారు. కోటా మించి పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత 24 గంటలలో రాష్ట్రంలో 76,330 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 7,430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,50,790.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటీన్ ప్రకారం గత రాత్రి 8 గంటలకు ముందటి 24 గంటలలో కరోనాతో 56 మంది మరణించారు.
ఫలితంగా మొదటి నుంచి కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,368కి చేరింది.
ప్రస్తుతం తెలంగాణలో 80,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1546 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు: 1,30,60,114