2015 జనవరి 14 తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్యను ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబిన్ ట్ నుంచి తొలగించారు. ఇది చాలా తీవ్రమయిన చర్య. సాధారణంగా విబేధాలుంటే రాజీనామా కోరాతారు. గాని, ఇలా అవమానకరమయిన చర్యకు సాధారణంగా రాజకీయ విబేధాలు దారితీయవు. అయితే, డాక్టర్ రాజయ్య విషయంలో వ్యవహారం క్యాబినెట్ నుంచి తీసేసే దాకా నడిచింది.
రాజయ్యను క్యాబినెట్ నుంచి తీసేయమని ముఖ్యమంత్రి అప్పటి గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ కు సిఫార్సు చేశారు. రాజయ్యను తీసేశాక ఆయన స్థానంలోకి కడియం శ్రీహరి వచ్చారు.
తీసేసేటప్పటికి రాజ్యయ ఆరోగ్య శాఖ మంత్రి. రాజయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన కడియం శ్రీహరి ఇపుడు కనుమరగయ్యారు.
రాజయ్య మీద రెండు ఆరోపణలు మీడియాలో వినిపించాయి. ఇందులో ఒకటి అప్పుడున్న స్వైన్ ఫ్లూ లో తెలంగాణలో ఎక్కువ మంది చనిపోయారనేది. రెండోది, అంబులెన్స్ ల కొనుగోలులో అవినీతికి పాల్పడారని. మొత్తానికి అవినీతి ఆరోపణలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2015 ఒక ఆరోగ్య మంత్రి కొలువుపోయింది.
ఇపుడు రెండో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ను కూడా ముఖ్యమంత్రి తప్పించేశారు. కాకపోతే, క్యాబినెట్ నుంచి కాదు, శాఖ నుంచి.
ఆరోగ్య శాఖను ఈ సారి ముఖ్యమంత్రి తన దగ్గిరే ఉంచుకున్నారు ముఖ్యమంత్రి.ఈ క్యాబినెట్ లో భిన్న స్వరం వినిపించిన వ్యక్తి రాజందరే.
రెండో ఆరోగ్య మంత్రి మీద వచ్చిన ఆరోపణలు భూకుంభకోణం. మెదక్ జిల్లాలో అచ్చంపేట లో తన హ్యచరీస్ కోసం అసైన్డు భూములను కాజేశాడనేది రాజేందర్ మీద ఆరోపణ.
క్యాబినెట్ నుంచి తీసేయడం లాగే పార్టీ నుంచి కూడా ఆరోపణలతో తీసేసిన సందర్భాలు టిఆర్ ఎస్ లో చాలా ఉన్నాయి.
ఇలా తెలంగాణ ఉద్యమం 2001లో మొదయినప్పటినుంచి ఎంతో మంది నాయకులు, అధినేత కెసిఆర్ కు నచ్చ పార్టీకి ఉద్యమానికి దూరమయ్యారు. స్వతంత్ర వ్యక్తిక్తం ఉన్న వాళ్లను కెసిఆర్ పార్టీలో ఎదగనీయరని , అందుకేవాళ్లందరిని ఆయన పార్టీ నుంచి తరిమేస్తారని కొందరు చెబుతారు. టిఆర్ ఎస్ అనేది కెసిఆర్ కుటుంబ పార్టీ కాబట్టి పార్టీలో కొనసాగే అంతో ఇంతో లబ్దిపొందాలంటే నోరు, వ్యక్తిత్వం వదులుకోని రావాలని,లేకపోతే, కొనసాగడం కష్టమని చాలా మంది చెబుతారు. ఉదాహరణకు నోరున్న మాజీ కాంగ్రెస్ నేత కె కేశవరరావు టిఆర్ ఎస్ లో చేరాక ఎలా ఉంటే ప్రయోజనమో తెలుసుకున్నారు, అలా నడుచుకుంటూ లబ్దిపొందున్నారు. 40 సంవత్సరాల రాజకీయజీవితంతో తనకు ఆయుధంగా ఉపయోగపడిన ‘నోటి’ ని ఎపుడో మూసేసుకున్నారు. దీనితో ఆయన కెసిఆర్ బాగా గుర్తింపు నిచ్చారు. అన్ని సమావేశాల్లో పక్కనే సీటు వేస్తున్నారు.
మరొక కాంగ్రెస్ నాయకుడు డిఎస్ ఇలా చేయలేకపోయారు. అంతే, కనుమరగై పోయారు. ఇలా ఎందరో ఇతర పార్టీలలో స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నవాళ్లంతా టిఆర్ ఎస్ లో చేరి వెనకబెంచీలో కూర్చుని లబ్దిపొందుతున్నారు. అలా కాకుండా టిఆర్ ఎస్ లో ముందువరసలోకి రావాలనుకుంటే నష్టపోతారు. ఇలా తమకేందో శక్తి ఉంది, టాలెంట్ ఉంది, అనుకుని ముందువరసలోకి రావాలనుకున్నవాళ్లు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే వాళ్లు, ఈ కింది జాబితాలో కలసిపోతారు. ఈ జాబితా సంపూర్ణం కాాదు కాని, గుర్తుంచుకోవలసిన జాబితా ఇది. ఇందులో ఎరెవరు ఉన్నారో చూడండి.
1,ఆలే(టైగర్ )నరేంద్ర,
2.శనిగరపు సంతోష్ రెడ్డి
3.మందాడి సత్యనారాయణ
4,కాసిపేట లింగయ్య
5.కె కె మహేందర్ రెడ్డి
6.M.D రహీం
7.రవీందర్ నాయక్
8.జిట్టా బాలకృష్ణా రెడ్డి
9.యెన్నం శ్రీనివాస్ రెడ్డి
10.విజయరామరవు
11.R.చంద్ర శేఖర్
12.కపిలవాయి దిలీప్ కుమార్
13.చెరుకు సుధాకర్
14.రఘునందరవు
15.విజయ శాంతి
16.దాసోజు శ్రవణ్
17. రాములు నాయక్
18.గాదె ఇన్నయ్య
19 ప్రో.కోదండరామ్
20. దేశిని చిన్న మల్లయ్య
21. రేగులపాటి పాపరావు
ఈ జాబితాలోకి తాజా గా చేరిన వ్యక్తి ఈటెల రాజేందర్.
ఇంకా చాలా మంది జాబితాలోకి వస్తారు. జాబితా క్లోజ్ కాదు.అనంతం.