మమతా బెనర్జీ కాదు, గెలిచింది సువేందు: మాట మార్చిన ఎన్నికల కమిషన్

పశ్చిమబెంగాల్ నందిగ్రామ్  ఎన్నికల ప్రకటనను ఎన్నికల కమిషన్ వెనక్కి తీసుకుంది. ఇంతకు ముందు అక్కడి నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెల్చినట్లు ప్రకటించింది. అయితే, ఆ ప్రకటనను వెనక్కి తీసుకుని ,ఇపుడు ఆమె ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థి సువేందు 1900 ఓట్ల మెజారిటితో గెల్చినట్లు ప్రకటించింది. అంతకు ముందు మమతాబెనర్జీ  1200 వోట్ల తో గెల్చనట్లు ప్రకటన వెలువడిందని వార్తాసంస్థలు సమాచారం అందించాయి.

అయితే, ఇపుడు వ్యవహారం తారుమారయింది.

 

 

ఇది ఇలా ఉంటే, నందిగ్రామ్ ఓట్ల కౌంటింగ్ జరుగుతూ ఉందని, ఫలితాల గురించి వూహాగానాలు చేయవద్దని తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అయితే, విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ప్రకటన మీద తాను అప్పీల్ కువెళతానని మమతాబెనర్జీ ప్రకటించారు. అయితే, ప్రస్తుతానికి ఈ తీర్పును అంగీకరిస్తున్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *