*దేశంలో కరోనా విపరీతంగా పెరుగుతూ ఉంది. దీని అడ్డుకట్టకవేయపోతే, మే నెలాఖరు కల్లా రోజూ కొత్త కేసులు పదిలక్షలకు చేరినా ఆశ్చర్యం లేదు.
*గత 24 గంటల వ్యవధిలో దేశంలో 4,01,993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఒక రోజు ఇంత పెద్ద మొత్తంలో కేసులు కనిపించడం ఇదే మొదటి సారి. రోజూ మూడు లక్షలకు మించి కేసులు కనిపించడం ఇది వరుసగా పదో రోజు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.91కోట్లకు చేరింది. 19,45,299 వైరస్ పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి. కోవిడ్ తాజా సమాచారన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కొద్దిసేపటి కిందట విడుదల చేసింది.
* దేశవ్యాపితంగా 3523 మంది కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 2,11,853 మందిని కొవిడ్ బలితీసుకుంది. మరణాల రేటు 1.11శాతం.
* గడిచిన 24 గంటల్లో దాదాపు 3లక్షల(2,99,988) మంది కరోనానుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.56కోట్లకు చేరింది. రికవరీ రేటు 81.84శాతం.
* మొత్తం ఇపుడు క్రియాశీల కేసులు 32లక్షలు దాటాయి. ప్రస్తుతం 32,68,710 మంది వైరస్‌కు చికిత్స (కేస్ లోడ్) తీసుకుంటుండగా యాక్టివ్ కేసుల రేటు 17.06 శాతానికి పెరిగింది.
* దేశంలో 15.49కోట్ల మంది టీకా పొందారు.