‘మేము కూడా ఓనర్లమే’’అన్నందుకే ఈటల మీద పగ: దాసోజు

‘’ సీఎం కేసీఆర్ తన తప్పులని కప్పి పుచ్చుకునేందు మంత్రి ఈటల రాజేందర్‌ ని బలిపశును చేసే కుట్ర చేస్తున్నారు ” అని ఆరోపించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.

మంత్రి ఈటెల 100 ఎకరాలు కబ్జా చేశారని స్వయంగా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా వుండే ఛానల్స్ లో పెద్ద ఎత్తున కధనాలు రావడం, దీనిపై వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు అదేశించడం ప్రస్తుతం సంచలనమైయింది.

దీనిపై ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ స్పదించారు. ‘’తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని, కాకపొతే కేసీఆర్ తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందు, తనపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత నుండి తప్పించుకునేందు మంత్రి ఈటెలని బలిపశువుని చేసే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు దాసోజు.

బలిపశువయ్యాడా?

‘’ఈటెల కబ్జాలకు పాల్పడితే తప్పకుండా శిక్షించాలి. కానీ అంతకంటే ముందు టీఆర్ఎస్ పార్టీలో శిక్షపడాల్సిన వారు చాలా మందే వున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అందరికంటే ముందు కేటీఆర్ కి శిక్షపడాలి. జన్వాడలో అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటున్న కేటీఆర్ కబ్జాలని వీడియో సాక్ష్యాలతో బయటపెట్టిన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. కానీ కబ్జాలకు పాల్పడిన కేటీఆర్ మాత్రం మంత్రిగా కొనసాగుతారు. మరి కేటీఆర్ కి ఒక న్యాయం, ఈటెల మరో న్యాయమా ? అని ప్రశ్నించారు దాసోజు.

‘’మంత్రి మల్లా రెడ్డి భూబకాసురుడిగా కనిపించిన భూమిని కబ్జా చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకూ ఆయనపై విచారణ లేదు. మల్లా రెడ్డి అక్రమాలు కేసీఆర్ కి కనిపించడం లేదా ? కరీంనగర్ లో భూకబ్జాలకు పాల్పడిన గంగుల కమలాకర్ పై చర్యలు ఎందుకు లేవు ? ఖమ్మంలో భూకబ్జాలకు పాల్పడిన పువ్వాడ అజయ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు ?

మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు ? ప్రభుత్వం విఫ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి .. పటాన్ చెరు లో మహిపాల్ రెడ్డి … ఇలా టీఆర్ఎస్ నాయకుల అక్రమాలు రాసుకుంటే రామాయణం, వింటే భారతం అన్నట్టు.. పెద్ద చిట్టానే వుంది. మరి వీరందరి మీద చర్యలు లేవు. పింక్ మీడియాలో వార్తలు రాలేదు. కేవలం మంత్రి ఈటెల పై ఇలాంటి వార్తలు రావడం వెనుక పెద్ద కుట్ర దాగుంది.

‘మేము కూడా ఓనర్లమే’’ అని ఈటల అన్నప్పటి నుంచి పగ

‘మేము కూడా ఓనర్లమే’’ అని గతంలో ఈటెల కామెంట్ ని పై కేసీఆర్ మనసులో కత్తికట్టుకుని ఉండొచ్చు , ఈ మధ్య కాలంలో ఈటెల చేసిన చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మించి కేసీఆర్ గత ఏడాది కరోనా కట్టడి విషయంలో పూర్తిగా విఫలం చెందారు. ఒక్క రివ్యూ పెట్టలేదు. ఒక్కసారి కూడా గాంధీ హాస్పిటల్ కి వెళ్ళలేదు. ఆయనే కాదు కేటీఆర్ కూడా చేయలేదు. అలాగే ఆరోగ్య శాఖకు సరైన నిధులు కూడా కేటాయించలేదు. ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు కేసీఆర్ ప్రజలలో తనపట్ల వున్న వ్యతిరేకత కేసీఆర్ కి అర్ధంఅయిపొయింది. ఇలాంటి తరుణంలో ఎవరినో ఒకరిని బలిపశువుని చేయాలి. ఆ బలి పశువు ఈటెల అని స్పష్టంగా కనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

‘’ఈటెలని తప్పించాలనేది కేసీఆర్ పన్నాగం. ఐతే కారణం లేకుండా తప్పిస్తే ప్రజలు నిలదీశారు. ఈటెల బీసీ బిడ్డ. తనకి పూర్తి అధికారులు ఇవ్వనప్పటికీ, నిధులు కేటాయించనప్పటికీ.. కరోనా కాలంలో ఈటెల యాక్టివ్ గా పని చేశారనే అభిప్రాయం ప్రజల్లో వుంది. ఇలాంటి పరిస్థితి ఈటెలని తప్పిస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. కుక్కని కొట్టాలంటే పిచ్చిదనే ముద్ర వేయాలి. ఇప్పుడు అలాంటే కుట్రే చేస్తున్నారు కేసీఆర్. గతంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా వున్న దళిత రాజయ్యని సరైన కారణాలు లేకుండా రాత్రిరాత్రికే బర్త్ రఫ్ చేశారు. ఈవాళ ముదిరాజ్ బిడ్డ అయిన ఈటెలపై పింక్ మీడియాలో కధనాలు వస్తున్నాయంటే ఒక కుట్రగానే కనిపిస్తుంది.
‘’తప్పు చేసిన ప్రతి ఒక్కరి శిక్ష పడాలి. కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. భూ కబ్జా, అక్రమ ఆరోపణలు ఎదురుకుంటున్న టీఆర్ఎస్ నాయకులందరిపైనా విచారణకు అదేశించాలి. మల్లా రెడ్డికో న్యాయం .. బీసీ బిడ్డ ఈటెలకు ఒక న్యాయం వద్దు. టీఆర్ఎస్ అక్రమార్కులందరిపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు దాసోజు.
రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్ వెనుక ప్రభుత్వ పెద్దలు !

రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్ వెనక ఎవరున్నారు?

‘’రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్ వెనుక ప్రభుత్వ పెద్దలే వున్నారనే’’ అనుమానం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్. సెకెండ్ వేవ్ కరోనా నియంత్రణలో అటు కేంద్రంలోని మోడీ సర్కార్, ఇటు రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందాయని మండిపడ్డారు దాసోజు. చంద్రమండలంపైకి రాకెట్లు పపించగల సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన భారతదేశంలో భూమిపై హాస్పిటల్ కట్టుకునే పరిస్థితి ఎందుకు లేదు? హాస్పిటల్ లో కనీస ఆక్సిజన్ సౌకర్యం ఎందుకు లేదు? ఐసీయూ బెడ్లు ఎందుకు లేవు? ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా వైద్యరంగంలో వేలాది ఖాళీలు ఎందుకు ఉన్నాయి ? ఈ పరిస్థితికి కారణం ఎవరు ? అని ప్రశ్నలు సంధించారు దాసోజు.

‘’సినిమా టికెట్లు బ్లాక్ లో కొన్నట్లు ఈ రోజు రెమిడిసివిర్ ఇంజక్షన్ ని బ్లాక్ లో అమ్ముతున్నారు. దీనికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వాలే. రూ.3500 రెమిడిసివిర్ ఇంజక్షన్ .. నేడు 25వేలు, 50వేలు, లక్షరూపాయిల చొప్పున బ్లాక్ లో అమ్ముతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది. ? బ్లాక్ మార్కెట్ ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ? ప్రభుత్వం తీరు చూస్తుంటే.. ప్రభుత్వ పెద్దలే ఈ బ్లాక్ మార్కెట్ లో భాగమయ్యారనిపిస్తుంది’’ అని అనుమానం వ్యక్తం చేశారు దాసోజు .

‘’రాజకీయాన్ని, పాలనని వ్యాపారంగా మార్చేసి ప్రభుత్వ పెద్దలకు వాళ్ళ ఇళ్ళల్లో కుక్కలపై వున్న ప్రేమ.. పేద ప్రజల పట్ల , కోవిడ్ బారిన పడి మరణానికి గురైన బాదితుల పట్ల లేదు. ఇది దుర్మార్గం. బిశ్వాల్ కమిటీ చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణలో మెడికల్ రంగంలో ముఫ్ఫై వేల ఖాళీలు వున్న్నాయి. వేలాది డాకర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా వున్నాయి. ఏడేళ్ళుగా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది ? దేశంలో అత్యంత ధనిక రాష్ట్రం గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు.. ఊపిరాడక ప్రజలు చనిపోతుంటే కనీస వైద్యం ఎందుకు అందించలేకపోతున్నారు ? అని సూటిగా ప్రశ్నించారు దాసోజు.

ప్రభుత్వం గనుక ఏడేళ్ళలో డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బందిని సకాలంలో భర్తీ చేసి వుంటే నేడు ఈ పరిస్థితి వుండేది కాదని వివరించారు దాసోజు.

‘’దేశ వ్యాప్తంగా మూడు లక్షల మంది వైద్యుల , ఐదు లక్షల పైగా నర్సుల అవసరం వుంది. ఎందుకు భర్తీ చేయడం లేదు. ప్రజలు కట్టిన టాక్స్ లు ఎక్కడికి పోతున్నాయి ? జీఎస్టీ, పెట్రోలో , డిజిల్, ఇతర పన్నులు .. ఇలా విచ్చలవిడిగా వసూలు చేసిన సొమ్ము ఎక్కడికిపోయింది ? ఐసీయు బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, మందులు లేవు,.. ప్రజా ఆరోగ్యం గాలికి వదిలేసి ఎవరి కోసం మీ పాలన అని ప్రశ్నించిన దాసోజు.. ఇటు కేసీఆర్ సర్కార్ కి అటు మోడీ సర్కార్.. హెల్త్ ఎమర్జన్సీని డిక్లేర్ చేయాలి’’అని విజ్ఞప్తి చేశారు.

‘’ప్రైవేట్ హాస్పిటల్స్ దారుణమైన దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రజలు వణికిపోతున్న పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితిలో ప్రజల భయాన్ని ఆసరాగ చేసుకొని జలగా రక్త పీల్చుకుంటున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుంది. ప్రభుత్వాలే ప్రైవేట్ దోపిడీని పరోక్షంగా ప్రోత్సహించే పరిస్థితి కనిపిస్తుంది’ అని ఆరోపించారు దాసోజు.

‘’ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖాళీగా వున్న పోస్టులని యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలి. మెడికల్ పట్టభద్రులు, ఫైనల్ ఇయర్ వున్నవారిని కూడా రిక్రూట్ చేసి కరోనా వార్డుల్లో పని చేస్తే వారికి ఇన్సెంటీవ్స్ ఇచ్చి ప్రోత్సహించండి. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు పెంచాలి. కొత్త హాస్పిటల్స్ నిర్మాణం చేయాలి. వెంటిలెటర్లు అందుబాటులో వుండే చర్యలు తీసుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు దాసోజు.
‘’ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాలు నేషనల్ ఎమర్జన్సీని డిక్లేర్ చేసి మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ ని టెక్ఓవర్ చేసుకోవాలని సన్నాహాలు చేస్తుంటే, ఇక్కడి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. మోడీ, కేసీఆర్ మానవీయ కోణంతో అలోచించండి , భాద్యతగా వ్యవహరించండి. వెంటనే నేషనల్ హెల్త్ ఎమర్జన్సీని డిక్లేర్ చేసి, ప్రజలని ఆదుకోండి’’ అని కోరారు దాసోజు.

‘’దేశంలో సగటు ప్రతి వెయ్యి మందికి 0.5 శాతం బెడ్లు వుంటే ప్రపంచ సగటు 2.9 శాతం. ఈ గణాంకాలు దేశం దిగజారిన పరిస్థితికి సంకేతం. మనకంటే ఆర్ధికంగా వెనుకబడిన దేశాలు కూడా ఎక్కువ బెడ్లు అందుబాటులో వున్నాయి. దేశంలో ఈ పరిస్థితి కి కారణం ఎవరు ? అని ప్రశ్నించారు దాసోజు.

‘’రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన సమయం ఇది. దయచేసి ప్రభుత్వాలు విజ్ఞతతో పని చేయాలి. కొత్త కోవిడ్ హాస్పిటల్స్ నిర్మాణం, సరిపడ బెడ్లు, ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్.. ప్రజలకు అందుబాటులో వుండే విధంగా చర్యలు తీసుకోవాలి. డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బందిని వెంటనే భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టాలి’’ అని కోరారు దాసోజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *