(నవీన్ కుమార్ రెడ్డి)
కరోనా వైరస్ మొదటిసారి వచ్చినప్పుడు తిరుపతి పట్టణంలో ఏ వీధిలోనైనా ఎవరికైనా పాజిటివ్ ఉంటే అక్కడ బ్లీచింగ్ వేయడం,శానిటేషన్ చేయడం,పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. కానీ సెకండ్ వేవ్ లో నగరపాలక సంస్థ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కనపడటం లేదు!
తిరుపతి నగరంలో ప్రజల నివాసాల మధ్య వున్న TTD వసతి సముదాయాలతో పాటు చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం కోవిడ్ హాస్పిటల్స్ గా, క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడం కరోనా వైరస్ తీవ్రతకు నిదర్శనం.
ఇలాంపుడు ఈ కోవిడ్ కేంద్రాలనుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాల నిర్వ హణ కూడా మెరుగ్గా ఉండాలి. తిరుపతిలోని కోవిడ్ హాస్పిటల్స్, వసతి సముదాయలలో వైరస్ సోకిన పేషెంట్లు వినియోగించిన మాస్కులు, ఇంజక్షన్లు,శానిటైజర్ లాంటి వ్యర్థ పదార్థాలను రోడ్లపై పడేస్తున్నారు. వీటిని జాప్యం చేయకుండా వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది. రోడ్ల మీద వాటిని ఎక్కువ సమయం ఉంచకుండా వెంటనే తొలగించేలా నగరపాలక సంస్థ”స్పెషల్ డ్రైవ్” పెట్టాలి!
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “డివిజన్ వాలంటీర్ల” ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించేలా “కరపత్రాలను” ఇంటింటికీ పంచాలి!
తిరుపతి నగరపాలక సంస్థలో పని చేస్తున్న (frontline warriors)పారిశుద్ధ్య కార్మికులు,ఇతర శాఖల లోని సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా నాణ్యమైన గ్లౌజ్ లు,మాస్కులు,శానిటైజర్ లు విటమిన్ మాత్రలు,ప్రత్యేక వైద్య పరీక్షల ఏర్పాటుపై కార్పొరేషన్ మేయర్ సభ్యులు అధికారులు దృష్టి సారించాలి!
తిరుపతి నగరంలో వ్యర్థ పదార్థాల తొలగింపు పారిశుద్ధ్యంపై నగరపాలక సంస్థ “స్పెషల్ డ్రైవ్” పెట్టాలి!
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుపతి లోని స్థానిక ఆలయాలకు వెళ్లి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం అవుతున్నారు వారిలో ఎవరికైనా పాజిటివ్ ఉన్నా అది స్థానికులకు సోకే ప్రమాదం ఉంది అలాంటప్పుడు తిరుపతిలో లాక్ డౌన్ “బూడిదలో పోసిన పన్నీరే” కదా…
మరిన్ని వివరాలకు వీడియో చూడండి:
(నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
INTUC జిల్లా గౌరవ అధ్యక్షులు)