సామాజిక మాధ్యమాల్లో కరోనా పై అవాస్తవాలు, పుకార్లను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ మంగళవారం ఒక ప్రకటన లో హెచ్చరించారు.
కొందరు దురుద్ధేశంతో కావాలనే జిల్లాలో నిర్వహిస్తున్న కోవిడ్ ఆసుపత్రుల పై అవాస్తవాలను సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగ్స్ ద్వారా వ్యాప్తి చేస్తున్నారని ఆయన అన్నారు. ఇవి తమ దృష్టికి వొచ్చాయన్నారు. కరోనా మహమ్మారి సమయంలో సామాజిక బాధ్యత ను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వార్తలను ప్రచారం చేస్తున్నారు. అటువంటి వాటిని ప్రోత్సహించ వద్దని ఆయన అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తప్పుడు ప్రచారం చేసే వారిపై, చట్టవ్యతిరేకమైన చర్యలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు