తిరుపతిలోని ప్రతిడివిజన్ లో కరోనా కేసులు ఉండటంతో మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. రేపటినుంచి మధ్యాహ్నం రెండు నుంచి బంద్ ప్రారంభమవుతుంది.దుకాణాలు, వ్యాపారాలు అన్ని రెండు గంటల కల్లా బంద్ చేయాల్సి ఉంటుంది. తిరుపతి మునిసిపల్ కమిషనర్ గిరీషా ఈ రోజు పట్టణ ప్రజాసంఘాల ప్రతినిధులతో, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమయి అందరి ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే విధంగా ఏ ఆలయంలో కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వరు. తిరుపతి తాతాయ కుంట గంగమ్మ జాతరని ఏకాంతంగా ప్రజలను అనుమతించకుండా నిర్వహిస్తారు. తిరుపతిలో కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో టిటిడి అతిధి గృహాలను కరోనా కేంద్రాలు మార్చేశారు.ఆయుర్వేద వైద్యకళాశాల, పద్మావతి మహిళా కళాశాలలను కూడా కోవిడ్ కేంద్రాలుగా మార్చారు.
సమావేశానికి ఎమ్మెల్యే కరుణాక ర్ రెడ్డి, ఎస్సి వెంకటప్పలనాయుడు కూడా హాజయ్యారు.కేసులు బాగా పెరుగుతున్నందున ఇక ముందు కరోనాను కట్టడి చేసే బాధ్యత ప్రజలమీదే ఎక్కువగా ఉంటుందని, వారంతా కచ్చితంగా కరోనా నియమాలు పాటించాల్సి ఉంటుందని కమిషనర్ చెప్పారు.
తిరుపతిలో పెరుగుతున్న కరోనా భయం వల్ల యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. నిన్న తిరుమల సందర్శించిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం నాడు తిరుమలను 16,560 మంది సందర్శించారు. తలనీలాలు సమర్పించినవ వారు 8,191మంది. శ్రీవారి హుండీ ఆదాయం రు. 1,21 కోట్లు. పోతే, శనివారం నాడు 23,998 మంది తిరుమల సందర్శించారు. 13,061 మంది తలనీలా సమర్పించారు.