ప్రపంచంలో మాస్క్ నియమం ఎత్తేసిన తొలిదేశం ఇజ్రేల్…
భారతదేశంలో ఫైన్ వేసి ప్రజలంతా మాస్క్ లు ధరించేలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటే, ఇజ్రేల్ మాస్క్ నియమం ఉపసంహరించుకుంది. అక్కడ మాస్క్ లు లేకుండా ప్రజలు స్వేచ్ఛంగా బహిరంగ ప్రదేశాలలో తిరగవచ్చు. దీనికి కారణం,కరోనాను పూర్తిగా కంట్రోల్ చేసినట్లు ఇజ్రేల్ ఒక నిర్ణయానికి రావడమే. కరోనవ్యాక్సినేషన్ విషయంలో ఇజ్రేల్ చాలా దేశాలకంటే ముందుంది. ఈ దేశం తొట్ట తొలీత వ్యాక్సినేషన్ మొదలు పెట్టిన దేశాల్లో ఇజ్రేల్ ఒకటి. వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాల్లో ఇజ్రేల్ నెంబర్ వన్. ఇజ్రేల్ అమెరికానుంచి ఫైజర్ వ్యాక్సిన్ (Pfizer-BioNtech mRNA vaccine) దిగుమతి చేసుకుని ప్రజలకు అందించింది.
దేశంలో 53 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకోవడంతో దేశంలో సగం జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చినట్లయింది. ఇజ్రేల్ జనాభా 93 లక్షలు. దేశంలో వయోజనుల్లో 80 శాతం మందికి వ్యాక్సిన్ అందింది. గతశుక్రవారం కొత్త కేసులు 105 నమోదయ్యాయి. యాక్టివ్ కేసులుకేవలం 2,586.మొత్తంగా ఇజ్రేల్ లో నమోదయిన కోవిడ్ కేసులు 837,309. మరణాలు 6,342. దీనితో గతంలో ఇజ్రేల్ కోవిడ్ పాండెమిక్ తో బాగా నలిగిపోయింది. కాని వైరస్ వ్యాప్తిని అదుపు చేసి ఇపుడు మాస్క్ లు వద్దనే స్థాయికి ఎదిగింది. అంతేకాదు, ఆ దేశంలో పాఠశాలలు తెరిచారు.విద్యార్థులు తరగతులకు రావడం మొదలయింది.
ఇపుడు రోజు వారి కేసులు కొత్త కేసులు నూరు కూడా లేకపోవడంతో ఇజ్రేల్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలన్ని నియమాన్ని ఎత్తేసింది.
దీనితో ప్రజల్లో కేరింతలు కొట్టారు. ఒక ఏడాదిగా మాస్క్ ఇజ్రేల్ ప్రజలను ఇబ్బంది పడుతూ వచ్చింది. ఇపుడు ప్రభుత్వం మాస్క్ లు అవసరం లేదని చెప్పడంతో స్వేచ్ఛగా అక్షరాల వూపిరి పీల్చుకున్నారు. ప్రజల్లో ఈ సంబరంకనిపిస్తూన్నది.
ఈ ఏడాది కాలంలో కరోనా ను కట్టడి చేయడంలో ఇజ్రేల్ విజయవంతమయింది. ఇజ్రేల్ మీద కరోనా మూడు సార్లు దాడిచేసింది. గత ఏడాది డిసెంబర్ 20 ఇజ్రేల్ ప్రధాని నెతన్యాహు తొలి వ్యాక్సిన్ తీసుకోవడంతో ఆదేశంలొ కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలయింది. అది దాదాపు విజయవంతమయింది.