వైజాగ్ స్టీల్ ఆక్సిజన్ మొదట ఆంధ్రా కే ఇవ్వాలి…

కరోనా సంక్షోభంలో దేశానికి అండగా నిలిచిన పరిశ్రమల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి. కేంద్రం వదిలించుకోవాలనుకున్నఈ ఫ్యాక్టరీ భారీగా ఆక్సిజన్ అందించి దేశానికి ప్రాణంపోస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో  ఉన్న ఈ ప్లాంట్ లో తయారవుతున్న ఆక్సిజన్ మొదట రాష్ట్ర అవసరాలు తీర్చాలని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకుకేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ రోజు  రాష్ట్ర కోవిడ్ పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇందులో తీసుకున్న ముఖ్యమయినఏడు కోవిడ్ నిర్ణయాలు ఇవే.

1.ఔషదాలు బ్లాక్‌ మార్కెట్‌ కావొద్దు: ‘ఆక్సీజన్‌ ఉత్పత్తితో పాటు, సరఫరాను హేతుబద్ధీకరించాలి. . అలాగే కోవిడ్‌ చికిత్సలో ముఖ్యమైన రెమిడిస్‌విర్‌ ఎక్కడా ఈ ఔషథం బ్లాక్‌ మార్కెట్‌ కాకుండా చూడాలి. ఏదైనా కుంభకోణం ఉంటే దాన్ని పూర్తిగా అరికట్టాలి. రాష్ట్రంలో కోవిడ్‌ వాక్సిన్, రెమిడిస్‌వర్‌ ఇంజక్షన్లు ముందుగా ఇక్కడి అవసరాలు తీర్చాలి.

2.కరోనా పరీక్షలు ఉధృతం చేయండి:                ‘పరీక్షల సంఖ్య కూడా అవసరం మేరకు పెంచండి. కోవిడ్‌ బారిన పడిన ప్రెమరీ కాంటాక్ట్‌లతో పాటు, ఆ పరీక్ష కోరుకున్న వారందరికీ వెంటనే పరీక్ష చేయాలి. వీలైనంత వరకు ఎవరి ప్రాణం కూడా పోకుండా కాపాడాలి. అది మనకు చాలా ముఖ్యం’.‘కోవిడ్‌ చికిత్స కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి. అవసరమైతే రైడ్స్‌ చేయండి. అందుకు అవసరమైతే ఒక సీనియర్‌ అధికారిని నియమించండి’.

మరింత సమర్థంగా 104: ‘104 కాల్‌ సెంటర్‌ మరింత సమర్థంగా పని చేయాలి. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క అధికారి ఓన్‌ చేసుకోవాలి. ప్రతి కాల్‌కు స్పందించాలి. మనం నిర్దేశించుకున్నట్లు ఫోన్‌ చేసిన 3 గంటల్లోనే బెడ్‌ కేటాయించాలి. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే తమకు సాయం చేశారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. అవసరమైనన్ని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయండి. వాటిలో తగిన సదుపాయాలు ఉండేలా చూడండి’.

ఫ్రీ వాక్సిన్‌: రాష్ట్రంలో 18–45 ఏళ్ల వయస్సు మధ్య వారందరికీ ఉచితంగా కోవిడ్‌ వాక్సిన్లు ఇవ్వాలి. ఆ మేరకు అవసరమైనన్ని డోస్‌లకు ఆర్డర్‌ పెట్టండి. 18–45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో 2,04,70,364 మందికి వాక్సిన్‌ వేయాల్సి ఉన్నందున ఆ మేరకు డోస్‌లు సేకరించాలి’.

నైట్‌ కర్ఫ్యూ: కోవిడ్‌ నియంత్రణలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూను అమలు చేయాలి. ఆ మేరకు రెస్టారెంట్లతో సహా అన్నింటినీ మూసేయాలి. అలాగే రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించండి. గతంలో మాదిరిగా వార్డులలో ప్రత్యేక మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేయండి’.

యథావిథిగా పరీక్షలు: ‘విద్యార్థులకు నష్టం కలిగించకుండా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ఆ పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దు’.

ఆక్సీజన్‌ రవాణా వాహనాలు: ఆక్సిజన్ కొరత నేపథ్యంలో విశాఖ స్టీల్ లో రోజుకు 100 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేసి, దాన్ని రాష్ట్రానికే ఇవ్వడంతో పాటు, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఆక్సీజన్‌ సరఫరా పెంచాలి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *