ఇపుడిపుడే కరోనా వ్యాక్సిన్ అందరికి అందేందుకు భారతదేశం ప్రయత్నం చేస్తూ ఉంది. మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడినవారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం అదేశించింది. ఇలాంటపు ఆందోళన కలిగించే వార్త పశ్చిమబెంగాల్ నుంచి వచ్చింది. అదేంటంటేఅక్కడ కరోనా వైరస్ కొత్త తరం కనిపించింది. ఇది వ్యాక్సిన్ లను ఆధిగమించే శక్తితో ఉందని దీనిని మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ వినోద్ స్కేరియా పేర్కొన్నారు. ఈ వైరస్ రకంలో E48K మ్యుటేషన్ ఉంది. దీనితో ఈ వైరస్ తరానికి మన రోగ నిరోధక శక్తిని కూడా తప్పించుకునే శక్తి వుంటుందని డాక్టర్ స్కేరియా చెప్పారు. ఇపుడిది బెంగాల్ బాగా ప్రబలి ఉంది.
నిజానికి కరోనా వైరస్ ను మనిషి సృష్టిస్తున్న అవరోాధాలను తట్టకునే శక్తి ని మ్యుటేషన్ల ద్వారా సంపాదించకుంటూన్నదని పాశ్చాత్య శాస్త్రవేత్తలు చాలా రోజులు కిందటే గుర్తించారు.దీనిమీద ట్రెండింగ్ తెలుగు న్యూస్ “కొత్త ట్రిక్స్ నేర్చుకుంటున్న కరోనావైరస్ (లేటెస్ట్ రీసెర్చ్)“అంటూ కొన్ని పరిశోధనల గురించి వివరించింది.ఇందులో జర్మనీ కి చెందిన వైరస్ బ్యాక్టీరియా స్పెషలిస్టు ప్రొఫెసర్ రిచర్డ్ నెహెర్, ప్రొఫెసర్ జెస్సికా ఎ ప్లాంట్ చేసిన పరిశోధనల ఫలితాలు వివరించడం జరిగింది. ఈపరిశోధనా పత్రాలుతయారయ్యే నాటికి యాంటిబాడీస్ ఎస్కేప్ వేరియాంట్ ఇండియాలో ఉన్నట్లు తెలియదు. ఇపుడు ఇండియాలో కూడా ఈ కరం కనిపించింది. ఇది ఆందోళన కలిగించే విషయం.
వినోద్ స్కేరియా న్యూఢిల్లీలోని CSIR అనుబంధంగా పనిచేసే Institute of Genomics and Integrative Biology లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. స్కేరియా ఈ B. 1.618 వేరియాంట్ మీద ఆసక్తికరమయిన విషయాలు ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఇపుడు కనిపిస్తున్న రోగనిరోధక శక్తి తప్పించుకునే వేరియాంట్స్ లో ఇదే ప్రధానమయిందని ఆయన చెప్పారు.మరొక విషయమేమింటే ప్రపంచమంతా కోవిడ్19 సమస్య తీవ్రమయినపుడు మోనోక్లోనల్ యాంటిబాడీస్ (mAbs) థెరపీని వాడేందుకు అనుమతి ఉంది. ఈ చికిత్సవల్ల కోవిడ్ ముదిరే అవకాశం ఉన్నరోగులు కూడా ఆసుపత్రి పోకుండా మెరుగుపడుతారు. ఇదే విధంగా ప్లాస్మా థెరఫీ కూడా చేస్తుంటారు. అయితే, E414 మ్యుటేషన్ వల్ల కరోనావైరస్ కు ఈ రెండురకాల ట్రీట్ మెంట్లవచ్చే యాంటిబాడీలకు దొరకకుండా తప్పించుకునే శక్తి వస్తున్నది.
“E484K is a major immune escape variant-also found in a number of emerging lineages across the world. E484K can escape multiple mAbs as well as panels of convalescent plasma.”
అంటే ఈ వేరియాంట్ వల్ల వచ్చే కోవిడ్ -19 ప్లాస్మా ధెరపీ అనేది, మోనోక్లోన్ యాంటిబాడీస్ థెరఫీలను పనికిరాకుండా చేస్తుంది.
ఈ వేరియాంట్ మొదట అక్టోబర్ 10, 2020 న బెంగాల్ లో కనిపించింది. ఇక పోతే, మహారాష్ట్రలో ఇపుడు విజృంభిస్తున్న కోవిడ్ రోగానికి కారణం మరొక వేరియాంట్ B.1.617. మహారాష్ట్రలో కనిపిస్తున్న కోవిడ్ పాజిటివ్ కేసులలో 60 శాతం ఈ రకానికి చెందినవే.
B.1.618 వేరియాంట్ గురించి మరిన్ని వివరాలందిస్తూ ఇది వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందో లేదో చెప్పాలంటే మరింత పరిశోధన జరగాలని స్కేరియా అన్నారు. ప్రపచంలోకనిపించిన B.1.618 కేసులలో 62.5శాతం భారతదేశంలోనే ఉన్నాయి.
B.1.618 – a new lineage of SARS-CoV-2 predominnatly found in India and characterized by a distinct set of genetic variants including E484K , a major immune escape variant. pic.twitter.com/dtfQJp2S2B
— Vinod Scaria (@vinodscaria) April 20, 2021