ఆక్సిజన్ లీకయి, వూపిరాడక 22 మంది కోవిడ్ రోగుల మృతి

దేశంలోని ఆసుపత్రులలో  ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దేశరాజధానిలో కూడా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆక్సిజన్ లీకయి, వూపిరాడక 22 మంది రోగులు హృదయ విదారకంగా చనిపోయారు. ఈ దుర్ఘటన మహారాష్ట్ర నాసిక్ మునిసిపల్ ఆసుపత్రిలో జరిగింది. నాసిక్ లోని జాకీర్ హుసేన్ ఆసుపత్రిలో 150 మంది  కోవిడ్ రోగులు చికిత్సపొందుతున్నారు.  23మంది ఆక్సిజన్ తీసుకుంటూ వెంటిలేటర్స్ మీద చికిత్స పొందుతున్నారు.అయితే, ఉదయం ఆక్సిజన్ ట్యాంక్ లీకయింది. దీనితో రోగులకు ఆక్సిజన్ సరఫరా తగ్గి పోయింది. ఫలితంగా ఊపిరాడక 22 మంది చనిపోయారని జిల్లా కలెక్టర్ సూరజ్ మంధారే తెలిపారు.  ఆక్సిజన్ టాంక్ ను నింపుతున్నపుడు లీకేజి బయటపడింది. దీనితో ఒక్క సారి ఆక్సిజన్ బయకు పోవడం మొదలయింది. పైపులలో ప్రెజర్ తగ్గిపోయింది. ఆక్సిజన్ అందక రోగులంతా కుటుంబ సభ్యుల ఎదటే కొట్టుమిట్టాడి చనిపోయారు. ఈ దుర్ఘటనతో బంధువులు కోపోద్రిక్తులయ్యారు. వారంతా మూకుమ్మడిగా వార్డు దగ్గిరకు వచ్చారు. ఫలితంగా గందరగోళం ఏర్పడింది. కోపోద్రిక్తులయిన కుటుంబ సభ్యులు దాడి చేయకుండాఉండేందుకు ఆసుపత్రిలో బందోబస్తు పెంచారు. దీనితో ఆక్సిజన్ పునరుద్ధరణ మరింత ఆలస్యమయినట్లు మీడియా సమాచారం.మొత్తానికి ఆక్జిజన్ ను పునరుద్ధరించగలిగారు.

ఒక ప్రయివేటు ఏజన్సీ సిబ్బంది సిలిండర్లను ఆక్సిజన్తో నింపుతున్నపుడు లీక్ అవుతుండటం గమనించారు.వారు వెంటనే టెక్నిషియన్లకు సమాచారం అందించారు.వారు వచ్చి లీకేజీని భర్తీ చేశారు. ఈ లోపు ఈ దర్ఘటన వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *