కొత్త ట్రిక్స్ నేర్చుకుంటున్న కరోనావైరస్ (లేటెస్ట్ రీసెర్చ్)

ఒక అద్భతమయిన జీవపరిణామ నాటకం మన ముందు నడుస్తూ ఉంది.ప్రకృతిలో ఇలాంటివి ఎన్నోజరుగుతూ ఉంటాయి. చాలా మటుకు అవి మనకు తెలియకుండా జరిగి పోతుంటాయి. బయో టెక్నాలజీ అభివృద్ధి చెండడంతో  ఇపుడు జరుగుతున్న  గొప్ప పరిణామ ప్రక్రియను శాస్త్రవేత్తలు పరిశీలించ గలుగుతున్నారు. ఇందులో ప్రధాన పాత్రధారి కరోనా వైరస్ (SARS-CoV-2).

ప్రపంచమంతా పాండెమిక్ ప్రకటించేంతగా ఈ వైరస్ కోవిడ్-19 (COVID-19) జబ్బు సృష్టించి దేశాలను చిన్నాభిన్నం చేయడంతో  కరోనా వైరస్ మీద మనిషి యుద్ధం ప్రకటించాడు.

వైరస్ ని అంత మొందించేందుకు వ్యాక్సిన్ లు తయారుచేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రపంచమంతా జరుగుతూ ఉంది.  వైరస్ కు మనిషెవరూ దొరకకుండా ఉండేందుకు మాస్కులు వాడుతున్నారు. శానిటైజర్లు వాడుతున్నారు. ఇంకా ఏవేవో మందులు, మాకులు తయారవుతున్నాయి.

అయితే, వీటన్నింటిని కూడా అధిగమించేందుకు కరోనావైరస్ కూడా సిద్ధమవుతూ ఉందని శాస్త్రవేత్తలు గమనించారు. ఒక్క మాటలో చెబితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు వ్యాక్సిన్ లు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ లు వైరస్ మన శరీరంలోకి రాకుండా అడ్డుకునేందుకు యాంటిబాడీలను తయారు చేస్తాయి. మనం ఇలా బలపడుతూ ఉంటే,ఈ యాంటి బాడీల బెడద  తప్పించుకునే ట్రిక్ ని కరోనావైరస్ నేర్చుకుంటున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంటే, మన రోగ నిరోధక శక్తి పెంచుకునేకొద్ది వైరస్ మనమీద దాడి  చేసేందుకు శక్తి పెంచుకుంటున్నది., తను బాగ బతికి బట్ట కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా కరోనావైరస్ రకరకాలు అవతరాల్లోకి మారుతూ ఉంది. వీటిని వేరియాంట్స్ (variants) అంటున్నారు.

తన జన్యుస్వరూపాన్ని (Genome) మార్చుకుని  కొత్త కరోనా వైరస్ రకాలను సృష్టిస్తూ ఉంది.  ఇలా మార్పు (Mutations) చెందుతూ  ఇంతవరకు కరోనా వైరస్ 20,000 రకాల గరూపాంతరాలు తీసుకుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇందులో  ఇంగ్లండు (B.1.1.7) దక్షిణాప్రికా (B.1.351), బ్రెజిల్  (P1), క్యాలిఫోర్నియా (B.429) రకాల గురించి మనం రోజూ వింటున్నాం.

భారతదేశంలో కూడా 771 వేరియాంట్స్ (variants of concern VOC) కనిపించాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 736 శాంపిల్స్ ఇంగ్లండు రకానివి. 34 రకాలు సౌతాఫ్రికా కోవలోనివి. ఒకటి బ్రెజిలియన్ సంతతిది. వైరస్ లో వచ్చిన మ్యూటేషన్స్ లో కూడా  రెండు రకాలు ప్రమాదకరమమయినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి  D614G, n501Y అనే రకాలు.

ఎందుకు కరోనావైరస్ ఎన్ని అవతారాలెత్తుతూ ఉంది?

దీనికి కారణం,కరోనా వైరస్ కు మనిషి పరిచమయింది ఒక ఏడాది కిందటే. అందువల్ల మానవ ప్రపంచంలో తనకు ఎదురవుతునన్న ప్రతికూలప  పరిస్థితులకు తట్టుకునేలా  మారేందుకు కరోనా వైరస్ చాలా పరిణామం చెందుతూ ఉంది.

మానవ ప్రపచంలో కరోనాకు ప్రతికూల పరిస్థితులేమిటంటే, సహజంగా వచ్చే సామూహిక రోగనిరోధక శక్తి (herd immunity),  వ్యాక్సిన్ లు, మందులు, మాస్క్ లు, పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్.. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.

SAS-CoV-2  వైరస్ గబ్బిలాలలో ఉన్నపుడు ఇన్ని కష్టాలు ఎదురు కాలేదు.  ఇన్ని రకాల దాడులను ఎదుర్కొని ఉండదు. గబ్బిల ప్రపంచం వేరు,మానవ ప్రపంచం వేరు. మానవ ప్రపచంలో తన జీవించడానికి, వ్యాప్తిచెందడానికి కరోనా వైరస్ కొత్త కొత్త రూపాల్లోకి మారాల్సి వస్తున్నది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కాదు ముఖ్యం, ఈ రకాలకు మెల్లిగా వ్యాక్సిన్ లను  పనిచేయకుండా చేసే శక్తివస్తున్నది. అది ఆందోళన కలిగించే విషయం అంటున్నారు శాస్త్రవేత్తలు.

యాంటిబాడిలకు దొరక్కుండా తప్పించుకునే శక్తి ని వైరస్ సంతరిచుకుంటునయనదని కూడా  శాస్త్రవేత్తలు గమనించారు.

ఇలాంటి కరోనా పరిణామాన్ని గమనించి శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్ రిచర్డ్ నెహెర్ (Prof. Richards Neher) ఒకరు. ఆయన జర్మనీ యూనివర్శిటీ ఆప్ బేసెల్ లోని బయోజెంట్రుమ్ (Biozentrum of University of Basel) బ్యాక్టీరియా, వైరస్ ల మీద పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త. ఆయన ఈ మధ్య కరోనావైరస్ గురించి ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడించారు.

 

Prof Richard Neher (source: Max-Planck-Gesellschaft)

గతంలో కరోనావైరస్ చాలా స్థిరమయిన వైరస్ అని అనుకునేవారు. అయితే, ఈ వైరస్ వేరియాంట్స్ చాలా తొందరగా తొందరగా కనిపిస్తుండటంతో శాస్త్రవేత్తలు అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. కొత్త వేరియాంట్స్ కి చాలా వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉండటం విశేషం అని ఆయన చెప్పారు. ఈ వేరియాంట్స్ ని శరీరంలోని యాండిబాడీలు గుర్తించలేకపోతున్నాయని  ఆయన ఒక ఆందోళన కరమయిన విషయం చెప్పారు.

వైరస్ మీద సెలెక్షన్ ప్రెజర్ బాగా పెరిగిందని, వాటికి అనుకూలంగా మారేందుకు ఒకే వైరస్ లో నాలుగుయిదు సార్లు మ్యుటేషన్లు జరుగుతున్నాయని ప్రొఫెసర్ నెహెర్ చెప్పారు.

మనిషిలో ఇమ్యూనిటీ పెరిగితే శరీరంలోని రక్షణ వ్యవస్థను కొంతైనా తప్పించుకునేందుకు వైరస్ కూడా ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు. (An increasing degree of immunity in the population favours virus variants that can partially escape the body’s defences)

ఈ పరిస్థితి వల్ల ప్రజల్లో, కొన్ని ప్రాంతాల్లోనయినా, సామూహిక రోగనిరోధక శక్తి (herd immunity)  పెరగడం జాప్యం అవుతుందని ప్రొఫెసర్ నెహెర్ చెప్పారు.

ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ ల శక్తి తగ్గిపోతూ ఉందని చెప్పలేం. అయితే, మారుతున్న వైరస్ ల వల్ల    కొని కొన్ని సంవత్సరాల తర్వాత వ్యాక్సిన్ లను తాజాగా తయారు చేసుకోవలసి రావచ్నని తనకు అనిపిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఫిట్ నెస్ కోసం తాపత్రయ పడుతున్న వైరస్

కరోనా వైరస్ కూడా ఫిట్ గా తయారయి, వేగంగా వ్యాప్తి చెందేందుకు, శక్తివంతంగా మనిషి మీద దాడి చేసేందుకు తన జన్యు పదార్థం (viral RNA)  లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంది. ఈ వైరస్ చైనా వూహన్ ప్రాంత గబ్బిలాలలో ఉన్నపుడు బతికేందుకు అంత పెద్దగా జన్యు వైవిధ్యం (genetic diversity)అవసరం లేకుండా ఉండింది.

మనిషిలోకి ప్రవేశించాక, కొత్త వాతావరణంలో తట్టుకుని నిలబడాలంటే వైవిధ్యం అవసరమని వైరస్ గుర్తించింది. కొత్త రూపాల్లోకి మారుతూ ఉంది. దీన్నుంచి వచ్చిందే D614G అనే మ్యుటేషన్. ఇది దీని తల్లి తరం (మ్యుటేషన్ లేని వైరస్)ల కంటే బాగా శక్తి వంతమయింది.  G614అనే మరొక మ్యుటేషన్  ఇంతకంటే శక్తి వంతమయిందని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

కరోనా వైరస్  ప్రపంచమంతా విస్తరిస్తున్నపుడు   వైరస్ మీద సెలెక్టివ్ ప్రెజర్ పెరుగుతూ పోతుంది. అపుడు కొత్త వైరస్ రకాలు నిరంతరం తయారవుతూ  ఉంటాయని మరొక శాస్త్రవేత్త జెస్సికా ప్లాంట్ (Jessica A. Plante et al :The Variant Gambit: COVID-19’s Next Move) బృందం భావిస్తూ ఉంది. ఈ క్రమంలో వైరస్ రకాలు సులభంగా, బాగా వేగంగా శక్తి వంతంగా వ్యాప్తి చెందేందుకే కాదు, యాంటీబాడీల ఉత్పత్తి వల్ల మనిషిలో పెరిగే రోగనిరోధక శక్తి ని తప్పించుకునేందుకు బాగా ఫిట్ గా తయారవుతాయాని జెస్సికా ప్లాంట్ బృందం చెబుతూ ఉంది.

దీనివల్ల వ్యాక్సిన్ ల సామర్థ్యం, వైరస్ వ్యాప్తి మీద ప్రభావం చూపుతాయి. (Shaped by fitness for replication and transmission, and escape from the antibody-mediated immunity, the current and new variants will impact the spread of the SARS-CoV-2 and the efficacy of the vaccines.

మొత్తానికి కరోనా మన వ్యాక్సిన్ లనుంచి వచ్చే ముప్పును అధిగమించేందుకుప్రయత్నాలు చేస్తూ ఉందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. అయితే, కరోనా వైరస్ ఏంచేయబోతున్నదో మనకు తెలుసు కాబట్టి,  వైరస్ నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కొకోవడం సులువవుతుందని జెస్సికా బృందం చెబుతూ ఉంది.