తెలంగాణలో కరోనా కర్ఫ్యూ… రాత్రి 9 నుంచి…

తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ఈ మేరకు ప్రభుత్వం జివొ విడుదల చేసింది. ఇది ఏప్రిల్ 30 దాకా అమలులో ఉంటుంది. కర్ఫ్యూ రాత్రి 9గంటలకు మొదలయి,మరుసటి రోజు ఉదయం 5 గంటల దాకా ఉంటుంది. కర్ఫ్యూను అమలుచేసేందుకు మార్కెట్లు మొత్తంగా ఎనిమిది గంటలకే మూసేయాలని ప్రభుత్వం పేర్కొంది.

All offices, firms,  shops, establishments, restaurants etc shall close at 8.00 pm except hospitals, diagnostic labs, pharmacies, and those dealing with supply of essentials, అని జివొ లో  పేర్కొన్నారు.

కర్ఫ్యూ నియమాలను ఉల్లంగిస్తే 2005 ప్రకృతివైపరీత్యా నివారణ చట్టంలోని 51 నుంచి 60 వరకు ఉన్న సెక్షన్లతో పాటు ఐపిసి 188 సెక్షన్ కింది చర్యలు తీసుకుంటారు.

రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్, షాపింగ్ మాల్స్ మెట్రోకు అనుమతి ఉంటుంది.

ఆసుపత్రులు, మందుల షాపులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్ లు పని చేస్తాయి. అంతరాష్ట్ర బస్సులు నడుస్తాయి. వీటిలో వచ్చేప్రయాణికులకోసం నిర్ణీత వేళల్లో ఆటోలు, టాక్సీలను అనుమతిస్తారు. అయితే, వీరిదగ్గిర టికెట్టు ఉండి తీరాలి.

ఇవి కాకుండా ఇతర వాహనాలను రోడ్ల మీద అనుమతించరు.

ఇ-కామర్స్ డెలివరీలను అనుమతిస్తారు.పెట్రోలు పంపులు పనిచేస్తాయి.

ఈ కరోనా రాత్రి కర్ఫ్యూ మే 1 ఉదయం అయిదుగంటల దాకా ఉంటుంది.

 

కర్యూ మినహాయింపు

మీడియా, పెట్రోల్ బంక్ లు, ఐటీ సేవలకు అనుమతి

కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్, విద్యుత్ యథాతథం

స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు యథాతథం

రైల్వేలకు, ఎయిర్ పోర్టుకు  కర్ఫ్యూ నుంచి మినహాయింపు

ఈ సారి కర్యూకు  ఎలాంటి ప్రత్యేకమైన పాసులు ఉండవు

కరోనా పరిస్థితులు అంచనా తర్వాత మే 1న ప్రభుత్వ నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *