డాక్టర్ సూర్యదేవర జతిన్ కుమార్ హైదరాబాద్ లో బాగా పేరున్న ఆర్ధోపెడిక్ సర్జన్. ప్రజారోగ్యం గురించి తీవ్రంగా కృషి చేస్తున్న వైద్యుడు.సైద్ధాంతికంగా మెరుగయిన సమాజం కోసం కట్టుబడిన వైద్యుడు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు సర్వత్రా అందుబాటులో ఉండాలనే సామాజిక వైద్యుడు. కరోనా గురించి ప్రజల్లో ఇంకా ఉన్న అపోహలకు, ఏడాది కరోనాబీభత్సం తర్వాత కూడా తొలగని అనుమానాలకు సమాధానం చెబుతున్నారు.
చాలా మందికి ఇంకా కరోనా అర్థంకావడంలేదు. కొందరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడంలేదు. అందుకే అసలు కరోనా అనేది ఒకటి ఉందా, ఉందో లేదో తేలియని దానికి వ్యాక్సిన్ అవసరమా? ఈ వ్యాక్సిన్ గొడవ వెనక ఔషధ తయారీ కంపెనీల వ్యాపారం దాక్కుని ఉందా… వంటి ప్రశ్నలు మనం వింటూంటాం. వీటికి సమాధానం చెప్పేందుకు డాక్టర్ జతిన్ కుమార్ ప్రయత్నిస్తున్నారు.
గతంలో ట్రెండింగ్ తెలుగు న్యూస్ కోసం ఆయన చాలా వీడియోలలో కరోనా గురించి ఎన్నో ఆసక్తి కరమయిన విశేషాలు చెప్పారు.ఈ పరంపరంలో ఇదొకట.
వీడియో వీక్షించడండి.
Explained about Corona in simple language to reach every body and also steps to be taken to avoid this virus.
Overall nice video with good information
Nice effort.Congrats.