ప్రభుత్వానికి రాబడి సమకూర్చేందుకు విశాఖ పట్టణం బీచ్ రోడ్ లో ఉన్న ఖరీదైన భూములను వేలం వేస్తుండటాన్ని రిటైర్డు ఐఎఎస్ అధికారి, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి,ప్రముఖ పర్యావరణ వాది డాక్టర్ ఇఎఎస్ శర్మ వ్యతిరేకించారు.
రాష్ట్ర ప్రభుత్వం విశాఖబీచ్ రోడ్డులో చాలా విలువయిన 13.59 ఎకరాల భూమిని వేలానికి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రకటన ప్రకారం ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన భూములలో ఒకటి.
దీనితో పాటు అనే చిన్నచితకా ప్లాట్లను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా వేలానికి పెట్టింది.
ఈ 13.59ఎకరాలను ధరను రు. 1452 కోట్లుగా నిర్ణయించింది. అయితే, ఈ భూములను ప్రభుత్వం అమ్మటానివీల్లేదని ఇవన్నీ కూడా కోస్టల్ రెగ్యులేటరీజోన్ (CZR) పరిధిలోకి వస్తాయని డాక్టర్ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు.
పట్టణ ప్రాంత భూములను విక్రయించి నిధులు సమకూర్చు కోవాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ 13.06.2020నే నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికిరాసిన లేఖను ఆయన ఇపుడుగుర్తు చేశారు.
విశాఖ పట్టణంలో ఆర్ కె బీచ్ సమీపాన సర్వేనెంబర్ 1011 లో ఉన్న 13. 83 ఎకరాల భూమి గత ప్రభుత్వం UAEకి చెందిన లూలూ కంపెనీకి ఒక ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్ ను కట్టేందుకు విక్రయించిందనిచెబుతూ అపుడు ప్రజలనుంచి బాగా వ్యతిరేకత వచ్చిందని ఆయన చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం ఈ విక్రయించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించిందనిచెబుతూ ఇదే భూములను ఇపుడు నిధులను కోసం వేలంవేయాలనుకోవడంసరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఈభూమి మొత్తం CRZ II పరిధిలో కి వస్తుందని, ఇది పర్యావరణ పరంగా సున్నితమయిన ప్రాంతమని చెబుతూ ఈ భూములను వేలం వేసే ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.
ఇదే కాకుండా మరిన్ని సున్నితమయిన కారణాలను కూడా ఈ భూములను అమ్మకుండా ఉండేందుకు తాను గతంలోనే చూపించాననిడాక్టర్ శర్మ చెప్పారు.
ఈ భూముల విక్రయం ఏమాత్రం ప్రజాప్రయోజనం కాదని , అందువల్ల వెంటనే వేలం నిలిపివేయాలని ఆయన కోరారు.
13.06.2020న డాక్టర్ ఇఎఎస్ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ
https://trendingtelugunews.com/english/trending/auctioning-vizag-beach-front-land-violation-of-crz-norms/