త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతున్న విశాఖ పట్టణంలో భూమి రికార్డు ధర సృష్టించింది. బహుశా ఇండియాలోనే ఎక్కడా ఎపుడూ పలకనంత ఎక్కువ ధర పలుకుతున్నది. విశాఖ పట్టణంలో రాష్ట్రప్రభుత్వం 13.59 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. దీని రిజర్వుడ్ బిడ్ రు. 1,452 కోట్లు. ఒపెన్ ఆక్షన్ ద్వారా ఈ భూమిని అక్షరాలా ఆకాశన్నంటే ధరకు అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఎకరాల రు. 106.80 కోట్లన్నమాట.
గతంలో ఈ భూమిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గల్ఫ్ కు చెందిన లూ లూ (Lulu) సంస్థకు కేటాయించింది. ఇపుడు ఇదే భూమిని జగన్ ప్రభుత్వం కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ అనుబంధంగా ఉన్న NBCC (India) ద్వారా విక్రయిస్తున్నది.
ఆసక్తి ఉన్న వాళ్లు ఏప్రిల్ 22 లోపు బిడ్స్ ను సమర్పించాలి. విశాఖలో చాలా ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎన్ బిసిసి ద్వారానికి వెేలానికి పెట్టింది.అవన్నీ చాలా చిన్న ప్లాట్లు. అంతఖరీదైనవి కాదు. ఈ 13.59 ఎకరాల ప్లాటే రాజకీయంగా, రెవిన్యూపరంగా కీలకమయింది. ఎవరో కొంటారో చూడాలి.
ఈ ధరకు ఈ భూమి అమ్ముడు పోతే, భారతదేశంలో ఖరీదయిన భూములన్న ‘రాష్ట్ర రాజధాని’గా విశాఖ పట్టణం రికార్డు సృష్టిస్తుంది.
ఈ ప్రాపర్టీ విశాఖబీచ్ రోడ్లో ఉంటుంది. ఒకపుడు ఈస్థలాన్ని దుబాయ్ కేంద్రం గాపనిచేసే లూలూ గ్రూప్ కు కారు చౌకగా కేటాయించారని వివాదం చెలరేగింది. దీనిమీద కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డా. ఈఎఎస్ శర్మవంటి వారు వ్యతిరేకతచెబుతూ లేఖలు రాశారు. లూలూ కంపెనీ ఇక్కడ ఒక ఇంటర్నేషన్ కన్వెన్షన్ సెంటర్ కట్టాలనుకుంది. ఈ మేరకు 2018లో చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ భూమిని అపుడు రు. 50 కోట్లకు లూలూ గ్రూప్ కే అప్పగించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రద్దు చేసిన కాంట్రాక్టు లలో ఇదొకటి. అక్టోబర్లో జగన్ క్యాబినెట్ ఈ కాంట్రాక్టును రద్దుచేసింది. ఈ స్థలంలో రు. 2200 కోట్లు ఖర్చు పెట్టి ఒక అంతర్జాతీయ స్థాయి మాల్ , కన్వెన్షన్ సెంటర్ కట్టేందుకు లూలూ గ్రూప్ శంకుస్థాపన కూడా చేసింది. రద్దయిన నెలరోజులోలనే తాము వైజాగ్ ఎలాంటి ఇన్వెస్ట్ మెంట్ చేసేది లేదని లూలూగ్రూప్ కూడా ప్రకటించింది.
ఇదే జరిగితే విశాఖలో అన్ని రకాల భూముల ధరలు కోట్లలోకి పెరుగుతాయి. ఈ భూమి ధర చూపి అంతా పెంచే అవకాశం ఉంది.ఇక రియల్టర్లకు పండగే పండగ. విశాఖలో సాధారణంగా చదరపు గజం రు. 1.3 లక్షల దాకా ఉంది. ప్రభుత్వం నిర్నయంతో ఈ ధర రు.2.20 లక్షలకు చేరుకున్నట్లు లెక్క.