6 రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత

ఆంధ్రప్రదేశ్, చత్తీష్ గడ్, హర్యానా, మహారాష్ట్ర,తెలంగాణలు ఇంతవరకు కరోనవ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్నాయి. ఇపుడ వీటికి ఒదిషా తోడయింది. ఈ రాష్ట్రాలన్నీ కొరత గురించి కేంద్రానికి తెలియచేశాయి.

మూడునెలల్లోనే వ్యాక్సిన్ కొరత వచ్చింది. ఒక వైపు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.మరొక వైపు అంక్షలేవీ లేకుండా అందరికి కరోనా వ్యాక్సిన వేయాలనే డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈ సమయంలోవ్యాక్సిన్ కొరత ఉందని రాష్ట్రాలు కేంద్రానికి తెలియచేస్తున్నాయి.

అయితే, కోవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి ప్రాధాన్యం పేరుతో కేంద్రం అన్ని వయోబృందాలకు కరోనావేయడాన్ని అంగీకరించడంలేదు. అయితే, అందరికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిందేనని ఢిల్లీ, మహారాష్ట్ర, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరుతున్నాయి.

ఇప్పటికేకంపెనీ వ్యాక్సిన్ ఉత్పత్తి మీద చాలా వత్తిడి పడుతూ ఉందని, జూన్ నాటికి ప్రొడక్షన్ పెంచాలంటే, రు.3,000 కోట్లు నిధులుకావాలని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇవొ అదార్ పూనావాల తెలిపారు.

ఒదిషాలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని, దీనితో 700 టీకా సెంటర్లను మూసేయాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. రాష్ట్రానికి తక్షణం 25లక్షల కోవిషీల్డ్ డోసులు కావాలని ఒదిషా కోరుతూ ఉంది.

ఇది ఇలా ఉంటే కేంద్ర విద్యాసంస్థలకు ప్రాధాన్యత పరంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్న విజ్ఞప్తిని కేంద్ర ఆరోగ్య శాఖ తిరస్కరించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *