రాకేష్ ఝున్ ఝున్ వాలా (Rakesh Jhunjhunwala) పేరు విన్నారుగా.ఇదంతా ఈజీగా మర్చిపోయే పేరు కాదు. ఈ పేరు ధ్వని కూడా చిత్రంగా ఉంటుంది.రిమ్ జుమ్ రిమ్ జుమ్… సంగీత ధ్వనిలా ఉంటుంది. ఆయన్ని భారతదేశపు వారెన్ బఫెట్ (Warren Buffet) అని పిలుస్తుంటారు.కారణం, ఆయనకు తెలిసినంతా భారత స్టాక్ మార్కెట్ మర్మాలు మరొకరి తెలియవని మీడియా తెగు రాసేస్తూ ఉంటుంది. గాలివీచేటపుడు ఏదిశలో వీస్తున్నదో చెప్పడం పెద్ద పనికాదు. గాలి, ఎటువీయబోతున్నదో చెప్పడం చాలా కష్టం. అందునా అంతుబట్టని స్టాక్ మార్కెట్ గాలి దిశ చెప్పడం మరీ కష్టం. అది అర్థంకాక చేతులు కాల్చుకుని బయటకు వచ్చిన వాళ్లంతా స్టాక్ మార్కెట్ ను జూదమని చెబుతూ ఉంటారు.
అయితే, ఝున్ ఝున్ వాలా అలాంటి బాపతు కాదు. స్టాక్ కదలిక పసిగట్టగలడు. గాలి ఎటువీచినా ఆయన నావ అటువైపు వెళ్లి లాభాలతో తిరిగొస్తుంది. అందుకే మొన్న కరోనా లాక్ డౌన్ కాలంలో లాభాలు ఆర్జించాడు. లాక్ డౌన్ ఎత్తేశాక లాభాలు అర్జించారు.
ఈ మధ్య ఒక స్టాక్ లో ఆయన సంపద 119 కోట్లు సంపాదిస్తే, ఒక్క ఏడాది ఆయన సంపద 373శాతం పెరిగింది. ఝున్ ఝున్ వాలా కు స్టాక్ మార్కెట్ కదలిక వాసన పసిగట్టి శక్తి వంశపారంపర్యంగా రాలేదు. ఆయన స్వయంగా కష్టపడి నేర్చుకున్న విద్య. పోర్బ్స సంపన్నుల జాబితాలో ఆయనది 49 స్థానం. ఆయన మొత్తం సంపద వీలువ $3 బిలియన్లు.
రూ.5 వేల తో స్టాక్ జీవితయాత్ర ప్రారంభం
ఇది నమ్మలేని నిజం. ఆయన స్టాక్ మార్కెట్ యాత్ర అయిదంటే అయిదువేల రుపాయలతోనే ప్రారంభమయింది. అది కూడా అప్పుచేసిన సొమ్మే. ఝున్ ఝున్ వాలా చార్టర్డ్ అకౌంటెన్సీ చేశాడు. అయితే, ఉద్యోగం చేయడం కంటే స్టాక్ మార్కెట్ బిజినెస్ లోకి ఎంటరయితే బాగుంటుందనుకున్నాడు. పేదవాళ్లు కాదుగాని, డబ్బుల్లేవు. స్టాక్ బిజినెస్ చేసేందుకు వాళ్ల నాయనకు అభ్యంతరం లేదు. కానీ, ఆయన ఒక్క పైసా ఇవ్వనంటున్నాడు. అంతేకాదు, అప్పుచేసేందుకు కూడా ఒప్పుకునే వాడు కాదు. ఇపుడెలా? ఆయన సోదరుడి దగ్గిరకు ఒక క్లయింటొచ్చే వాడు. ఝున్ ఝున్ వాలా ఆయనను వప్పించి, ఒక అయిదువేలు అప్పు సంపాదించాడు. అయిదువేల రుపాయలతో ఆయన 1985 స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించాడు. 2018 నాటికి ఈ రు. 5 వేలు పెరిగి పెరిగి రు. 11,000 కోట్లయ్యాయి.
అంతా అలా సంపన్నులవుతారని దీని నీతి కాదు. ఈత నేర్చుకుంటే లోతుల్లోకి వెళ్లిరావచ్చు, ఈచివరనుంచి ఆచివర దాకా ఈదవచ్చు. లోతైన చెరువులో ఈదులాడా లంటే ఈత వచ్చి తీరాలని చెప్పడమే.
ఝున్ ఝున్ వాలాకు స్టాక్ మార్కెట్ మీద మక్కువ పెంచింది వాళ్లనాయనే. ఆయన నేరుగా ఝున్ ఝున్ వాలాకు నేర్పించిన విద్య కాదిది. మిత్రులకు స్టాక్ మార్కెట్ గురించి చెబుతున్నపుడల్లా ఝున్ ఝున్ వాలా చెవులటు వైపే ఉండేవి. స్టాక్ మార్కెట్ లోకి ఎంటరయ్యే వ్యక్తి న్యూస్ పేపర్లు క్షుణ్ణంగా చదవాలని నాయన చెప్పేవాడు. ఎందుకంటే, న్యూస్ స్టాక్ మార్కెట్ ని బాగా ప్రభావితం చేస్తాయనేది ఆయన నమ్మకం. ఝున్ ఝున్ వాలా ఇదే చేశాడు.
1986లో అదృష్టం తలుపుతట్టింది
1985లో రు. 5వేలతో మార్కెట్లోకి ప్రవేశించిన ఝున్ ఝున్ వాలా 1986లో లక్షాధికారి అయ్యాడు. ఝున్ ఝున్ వాలా స్టాక్ మార్కెట్ సాహసి. ఎవరో కవిచెప్పినట్లు సాహిసికాని వాడు జీవన సమరానికి పనికిరాడు. స్టాక్ మార్కెట్ లో ఎన్నికష్టాలున్నా సాహసం చేసేందుకు వెనకాడని వాడు ఆయన. తెగించి, 1986లో టాటా టీ (Tata Tea) కంపెనీకి చెందిన 5 వేల షేర్లు కొన్నాడు. షేర్ ధర రు. 43 మాత్ర మే.ఆ షేర్ ధర మూడునెలల్లో రు. 143కు చేరింది. ఒక్కదెబ్బతో ఝున్ ఝున్ వాలాకు రు. 20 లక్షల పైబడి లాభం వచ్చింది. అంతే, ఝున్ ఝున్ వాలా ఇన్వెస్ట్ మెంట్లు బాగా లాభాలు తెచ్చిపెట్టి భారత్ స్టాక్ మార్కెట్ బాహుబలిని చేశాయి. ఆయనకు ఎదురు దెబ్బలు తగల్లేదని కాదు దీనర్థం. వైఫల్యాలు ఎదురయినా అంతిమంగా విజయం సాధిస్తూనే వచ్చాడు. మిడ్ క్యాపిటల్, స్మాల్ క్యాపిటల్ కంపెనీలలో 20 కంపెనీలకొన్ని 100 శాతం గ్రోత్ చూపించాయి. ఇందుల్ పది కంపెనీలు తుస్సు మన్నాయి. మరొక అయిదు కంపెనీలు పర్వాలేదు. మిగతా అయిదు స్టాక్ లే బ్యూటిఫుల్ గా పనిచేశాయని ఆయన ’ఒక సారి ఎకనమిక్ టైమ్స్‘ కు చెప్పారు.
ఒక్క ఏడాదిలో గ్రోత్ 371 శాతం
రాకేష్ ఝున్ ఝున్ వాలా చాలా కంపెనీ స్టాక్ ఉంది. అందులో ప్రకాశ్ పైప్స్ (Prakash Pipes) ఒకటి. ఈ మధ్య ప్రకాశ్ పైప్స్ వీపరీతమయిన లాభాలు తెచ్చిపెట్టి బాగా వార్తల్లో ఉంది. షేర్ హోల్డర్లకు ఈ కంపెనీ ఏకంగా 373 శాతం గ్రోత్ అందించింది. అదొక రికార్డు. ప్రకాశ్ పైప్స్ ఏమంత పెద్ద కంపెనీ కూడా కాదు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కేవలం రు. 300 కోట్లు మాత్రమే.అయితేనేం, ఈ కంపెనీ ఆశాజనకంగా ఉంది. ఈ కంపెనీ ప్రధానంగా తయారు చేసేది పివిసి పైపులనే. అయితే,ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంతో పాటు, అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంటింటికి వాటర్ కనెక్షన్ లను ఇచ్చేందుకు ప్రాముఖ్యం ఇస్తున్నాయి. అన్ని పార్టీలు దీనిని ఎన్నికల మ్యానిఫెస్టోల్ పెడుతున్నాయి. ఇంటింటికి కొళాయిఅనేది తెలంగాణ నుంచి అస్సాం దాకా ప్రతిధ్వనిస్తున్న అతిముఖ్యమయిన స్లోగన్. ఇదే ఈ మధ్య ఎన్నికల్లో ప్రధాన వార్త. వార్తలు స్టాక్ మార్కెట్ ప్రభావితం చేస్తాయనేందుకు ఇదొక పెద్ద ఉదాహరణ. 2020 ఏప్రిల్ 8న లాక్ డౌన్ కాలంల్ ఈ కంపెనీ షేర్ విలువ రు. 26.70 మాత్రమే. అయితే ఏప్రిల్ 5,2021 నాటికి రు. 126.40 కి చేరింది.
ఈ కంపెనీలో ఝున్ ఝున్ వాలా కు 3,12,500 షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల విలువ 373 శాతం పెరిగింది. ఇపుడు లెక్కవేయండి ఆయనకు ఎంత లాభం వచ్చిందో.. రు. 7,261 కోట్లు, అవునా? ఇవేకాదు, ఆయన ఎంచుకున్న
ఇలాంటివి ఎన్ని జాక్ పాట్ లు కొట్టారో…
తాజాగా ఆయన జాక్ పాట్ టైటాన్ కంపెనీ లిమిటెడ్. మార్చిలోనే ఆయన ఈ కంపెనీ షేర్ల నుంచి రు. 196 కోట్లు లాభాల వాన కురిసింది. ఝున్ ఝున్ వాలా కు ఆయన భార్య రేఖా ఝున్ ఝున్ వాలా కు కలిపి టైటాన్ 5.3 శాతం వాటా ఉంది. ఇందులో ఆయన భాగానికి 3,75,10,395 షేర్లుంటే, భార్య రేఖ పేరు మీద96,60,575 షేర్లు న్నాయి. మొత్తంగా 4.71 కోట్ల షేర్లున్నాయన్నమాట. 2021 మార్చి 19వ తేదీన ఈ షేర్ల మొత్తం విలువ రు. 6,923.28 కోట్లు. మార్చి 23న ఈ షేర్ల ధర 2 శాతం పెరిగింది. శుక్రవారం నాటికి నాలుగు శాతం పెరిగింది. ఆయన కుటుంబ షేర్ల విలువ రు. 7,120.22 కోట్లకు చేరింది. అంటే 96.94కోట్లు. గత ఆరు నెలల్లో స్టాక్ మార్కెట్ గ్రోత్ 32 శాతం అయితే, ఈ షేర్ ధర 33 శాతం పెరిగింది. దీనితో ఆయన ప్రాఫిట్ బుకింగ్ చేసి, టైటన్ లో తనవాటా తగ్గించుకున్నారు. ఇపుడు ఆయనకు టైటానల్ ఉన్న షేర్లు 18 లక్షలు మాత్రమే.