సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా రానా దగ్గుబాటికి ఫాలోయింగ్ వుంది. బాహుబలి కంటే ముందు, దమ్ మారో దమ్, డిపార్ట్ మెంట్, ఏ జవానీ హై దీవానీ, బేబీ అనే హిందీ సినిమాలతో నార్త్ ప్రేక్షకులకి రానా పరిచయస్థుడే. బాహుబలితో మరింత పాపులర్ అయ్యాడు. బాహుబలి తర్వాత ఘాజీ, వెల్కం టు న్యూయార్క్, హౌస్ ఫుల్ 4, హాతీ మేరే సాథీ అనే 4 హిందీ సినిమాలతో ఎస్టాబ్లిష్ అయ్యాడు.
అతడి శరీరాకృతి, రూపం, ప్రతిభ, వినయపూర్వక స్వభావం అతడిని అభిమానించేలా చేస్తాయి.
ఇప్పుడు టాలీవుడ్ లో తాజా అప్డేట్ ప్రకారం, మరోసారి రానా దగ్గుబాటి పీరియడ్ డ్రామాలో నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ వెంకీ.
రానా దగ్గుబాటి ఇప్పటికేవంటి కొన్ని పీరియడ్ మూవీస్ లో నటించాడు. బాహుబలి ఫ్రాంచైజ్, ఎన్టీఆర్ బయోపిక్, విరాట పర్వం మొదలైనవి. కొత్త దర్శకుడు వెంకీ పీరియడ్ డ్రామా వినిపిస్తే రానా ఓకే చేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. కొద్ది నెలల్లో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమవుతుంది. అయితే టాలీవుడ్ గుసగుస ఏమిటంటే, ఇది బహుభాషా పానిండియా మూవీగా వుంటుందని. అయితే ఈ పీరియడ్ కథ ఏ ప్రాంతపు కథో వెల్లడి కాలేదు. ఇది పానిండియా మూవీయే అయితే హిందీ ప్రేక్షకులకు మరోసారి పండగే.