కరోనాకేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంలో దేశరాజధాని ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. రాత్రి పది నుంచి ఉదయం 5 దాకా కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
రాత్రి బస్సులు,ఆటోలు, టాక్సిీలు తిరుగుతాయి. అయితే, కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్నవారు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. పాస్ ఉన్న ప్రయాణికులను మాత్రమే విమనాశ్రయాలకు, బస్సాండ్ లకు, రైల్వే స్టేషన్లకు అనుమతిస్తారు. డాక్టర్లకు, నర్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇ-పాస్ తో పళ్లుదుకానాలు, మెడికల్ షాపులు పనిచేయవచ్చు.