సుప్రీం కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ నెల 24న జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టులో సినియర్ మోస్ట్ న్యాయమూర్తిఅయిన జస్టిస్ రమణ పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎ బాబ్డే సిఫార్సు చేశారు.
జస్టిస్ రమణ కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామలో 1957 ఆగస్టు 27న జన్మించారు. 1983 ఫిబ్రవరి 13న న్యాయవాదిగా నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో శాశ్వత న్యాయమూర్తిగా 2000, జనవరి 27న నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి 2013 మే 20 దాకా ఆంధ్రప్రదేశ్ తాత్వాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 17 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.