హైకోర్టు జడ్ పి ఎన్నికల మీద స్టే ఇవ్వగానే చాలా మంది ముఖ్యంగా రూలింగ్ పార్టీకి చెందిన అభ్యర్తులు కుయ్యో మెర్రో అంటున్నారు. ఏనిమిదో తేదీన పోలింగ్ కువీళ్లంతా సిద్ధమవుతున్నారు. బ్యాలట్ పేపర్ తో ఇతర పంపకాలు అన్ని రూపాలల్లో జరుగుతున్నాయి. వైసిసి అభ్యర్థులు గెలుపు ధీమాతో కాలర్ ఏగరేసుకుని తిరుగుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు నీళ్ళల ఖర్చు చేస్తున్నారు. అలిగిన వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వైన్ షాప్ లు పార్టీ కార్యకర్త లతో నిండి పోతున్నాయి. గల్లీ లీడర్ల పరిస్థితి మూడు ఫుల్ లు ఆరు హాఫ్లు గా ఉంది. పోలింగ్ సమీపిస్తున్నది కాబట్టి ఈ ఖర్చును భరిస్తే తర్వాత పవర్ లోకి వస్తామనే ధీమాతో అభ్యర్థులు ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఓటుకు నోటు బాగా అమలవుతున్నదని చెబుతున్నారు. ఇలాంటి ఎన్నికల సందడిలో ఈ నెల 8వ తేదీన జరిగే పరిషత్ ఎన్నికలకు హైకోర్టు లో బ్రేక్ పడింది.
గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు లో ఎన్నికల నిర్వహణ కు కనీసం 4వారాలు ముందుగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉంది. దీనికి విరుద్ధంగా కేవలం 8రోజుల వ్యవధిలో ఎన్నికలు జరపాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘం కు గట్టి ఎదురు దెబ్బ గా చెప్పవచ్చు. కొత్తగా కమిషన్ బాధ్యతలు చేపట్టిన కమిషనర్ నీలం సాహ్ని వచ్చి రావడం తోటే ఎన్నికల నిర్వహణ కోసం చర్యలు చేపట్టారు.
అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిన నిర్ణయంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగారు.ఆమె సుప్రీంకోర్టు ఉత్తర్వులను గాని, నియమావళి గాని పట్టించుకోలేదని వారు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం అమలుచేసేందుకే ఆమె ఒక వైపు రాజకీయ పార్టీలను సమావేశానికి పిలిచి వారితో చర్చించడానికి ముందే పోలింగ్ నిర్నయం ప్రకటించడం పట్ల అన్ని పార్టీలు నిరసన తెలిపాయి.
ఈ నిర్ణయం పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం ఎన్నికల ను బహిష్క రించగా, అదే బాటలో అటు బీజేపీ, జనసేన పార్టీలు నడుస్తున్నాయి.
అంతే కాకుండా ఈ అంశంపై హై కోర్టు లో కేసులు వేసింది కూడా వారు. ముఖ్యంగా మొత్తం ఎన్నికల ప్రక్రియ మొదటి నుండి ప్రాభించాల నేది వారి వాదన.
అయితే అది వీలుకాదు, గతంలో ఏక గ్రివం అయిన వాటిని కాకుండా ఎక్కడ నిలిచిపోయాయో అక్కడనుండి జరపాలని ప్రభుత్వం వాదన.
కొంతమంది ఎన్నికలు తొందరగా అయిపోతాయని భావించి గతంలో లక్షలు ఖర్చు పెట్టిన అభ్యర్థులు తెచ్చ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. సరే ఖర్చులో ఖర్చు గా భావించి గత వారం రోజులుగా మరల ఖర్చు పెడతున్నారు. ఒక సారి పదవిలోకి వస్తే ఈ కష్టాలన్నీ తీరతాయని ఆశ.
తీరా చూస్తే చావు కబురు చల్లగా చెప్పినట్లు. మంగళ వారం మధ్యాహ్నం వరకు సస్పెన్స్ మూవీ లాగా తీర్పు రిజర్వ్ చేసి నేడు హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది.
ఇది ముందే చేస్తే మా ఖర్చులు మిగిలేవి కదా అని అభ్యర్థులు వాపోతున్నారు. ఒక వేళ ఎన్నికలు మరలా మొదటి నుండి అన్నా లేదా 4వారాల గడువు ఖచ్చితంగా అమలు చేయాలని తదుపరి తీర్పు వస్తే మాకుటుంబాలు వీధుల పాలవడం ఖాయం అంటున్నారు. కోర్టు కేసును ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. జస్టిస్ యు దుర్గా ప్రసాద్ బెంచ్ ఈ ఉత్తర్వులిచ్చింది.దీనిమీద డివిజన్ బెంచ్ కి కమిషన్ అప్పీలు కు వెళ్లే అవకాశం ఉంది. అంతవరకు ఆశ అభ్యర్థులు ఎదురుచూస్తూండాలి.
– బాబ్జీ అడ్వకేట్.