మహారాష్ట్ర ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ ని వచ్చే సోమవారం నుంచి మూసివేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో విపరీతంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నందు నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నంటిని మూసివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే సాయిబాబా ఆలయాన్ని సోమవారం రాత్రి నుంచి నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా ఆలయాన్ని మూసి వుంచుతారు.అయితే, ఆలయం లోపల పూజారులే నిత్య పూజలు నిర్వహిస్తారు. ప్రసాదాలయం, డైనింగ్ హాల్ లు, దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉండవని ఆలయ కార్యనిర్వహణాధికారి రవీంద్ర ధాక్రే తెలిపారు. అయితే, సిద్ధివినాయక ఆలయంలో ఈ రోజు 8 గంటలనుంచి దర్శనాలను నిలిపివేశారు. దర్శనాలకు QR కోడ్ ఇవ్వడం కూడా నిలిపివేశారు. అయితే, ఇక్కడినుంచి పూజలను లైవ్ అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో చూడవచ్చు.
కరోనా వ్యాప్తి నివారించేందుకు రాష్ట్రంలో ఇప్పటికే అనేక వూర్లలో రాత్రి కర్ఫ్యూ విధించారు. పాఠశాలు మూసేశారు. అనేక ఇతర ఆంక్షలు కూడా విధించారు.