పానిండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రోమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ ప్రమోషనల్ కార్యక్రమాలు ఈ నెలనుంచి ప్రారంభమవుతున్నాయి. రెండు టీజర్లు, ట్రైలర్, ఐదు పాటలు ఈ ప్యాకేజీలో వుంటాయి. ఏప్రిల్‌లో రెండు టీజర్స్ తో పాటు ఒక్కో సాంగ్‌ని రిలీజ్ చేస్తూ వస్తారని నిర్మాతలు విడుదల చేసిన సమాచారం. ఇక థియోట్రికల్ ట్రైలర్‌ని మేలో రిలీజ్ చేస్తారు. ఈ రెండు నెలలు దేశవ్యాప్తంగా రాధే శ్యామ్ సందడి వుంటుంది.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పానిండియా మూవీగా రాధే శ్యామ్ ప్రేక్షకుల ముందుకు జులై 30 న రానుంది. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ మధ్య విజయవంతంగా జార్జియన్ షెడ్యూలు పూర్తి చేసుకుని వచ్చారు.
రాధే శ్యామ్ మ్యూజిక్ విషయంలో విభిన్నంగా వుండబోతోంది.
వేర్వేరు మార్కెట్ల కోసం వేర్వేరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. సినిమాలో మొత్తం పాటలు వేర్వేరు వెర్షన్లలో భిన్నంగా ఉంటాయి, ఇది భారతీయ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ జరగని ప్రయోగం. అంటే వేర్వేరు జట్లు హిందీ, తెలుగు భాషలలో వేర్వేరు పాటలు కంపోజ్ చేస్తారు. హిందీ పాటల కోసం మిథూన్ ఈ చిత్రానికి రెండు పాటలు కంపోజ్ చేయనుండగా, మనన్ భరద్వాజ్ ఒక ట్రాక్ కంపోజ్ చేయనున్నారు. వీరితో పాటు, హిందీ మ్యూజికల్ ఇండస్ట్రీకి చెందిన కుమార్, మనోజ్ ముంతసిర్ వంటి కవులు పాటల సాహిత్యంపై పని చేస్తున్నారు.
తెలుగు పాటల కోసం జస్టిన్ ప్రభాకర్ సంగీత దర్శకుడిగా, కృష్ణ కాంత్ పాటల రచయితగా పనిచేశారు. యువి క్రియేషన్స్ -గోపికృష్ణ మూవీస్- టీ సిరీస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు